అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారి ఆహారపు అలవాట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…

SR NTR

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అద్భుతమైన నటనతో ఒక ఊపు ఊపిన నటుడు సీనియర్ ఎన్టీఆర్.థియేటర్ లో ఆయన సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం ప్రేక్షకులు బ్రమ్మరథం పట్టేవారు.ఇక తెలుగు ప్రజలు ఆయనను హీరోల కాకుండా దేవుడి లాగా భావించేవారు.ఈ విధంగా సినిమా రంగంలో సీనియర్ ఎన్టీఆర్ గారు తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు.రాజకీయాలలో కూడా అరంగేట్రం చేసి మహా నాయకుడిగా ఎదిగారు.ప్రజల కోసం ఎన్నో పథకాలు చేసి ప్రజల దేవుడు అనిపించుకున్నారు.తెలుగుదేశం పార్టీ ని ప్రారంభించి ప్రజలకు మంచి పాలనా అందించారు.పేదల పక్షాన నిలపడి ముఖ్యమంత్రి గా సీనియర్ ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రతి విషయంలోనూ ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారంట.సినిమా అయినా రాజకీయ జీవితం అయినా,వ్యక్తిగత జీవితం అయినా సరే ఒక క్రమశిక్షణ మరియు సమయపాలన సీనియర్ ఎన్టీఆర్ గారు తప్పనిసరిగా పాటించేవారట.ఇక సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక సెషన్ మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరొక సెషన్ షూటింగ్ లో పాల్గొనే వారంట సీనియర్ ఎన్టీఆర్ గారు.ఇలా సినిమా లే కాకుండా ఆహారపు అలవాట్లలో కూడా ఒక ప్రత్యేకత ఉండేదట.

Sr NTR Food Habits
SR NTR

సీనియర్ ఎన్టీఆర్ గారు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలకే నిద్రలేచేవారంట.వ్యాయామం చేసి స్నానం ఆచరించి 24 ఇడ్లిలు తినేవారట.ఇప్పుడున్న ఇడ్లిలా కంటే ఆ ఇడ్లిలు డబల్ ఉండేవట.ఇలా కొంత కాలం ఇడ్లిలు తిన్న ఆయన ఆ తర్వాత ప్రతిరోజూ ఉదయం భోజనం చేసేవారంట.భోజనంలో ఖచ్చితంగా మాంసాహారం ఉండేలా చూసుకునేవారు.ఇక ప్రతిరోజూ రెండు లీటర్ల బాదం పాలు కూడా తాగేవారు.ఇక చెన్నైలో ఎప్పుడైనా బజ్జిలు తినాలి అనుకున్నప్పుడు 30 లేదా 40 బజ్జిలు చాల సునాయాసంగా తినేవారంట.ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఒక ప్రత్యేకతను కలిగి ఉండేవారు అని ఆయనకు తెలిసిన వాళ్ళు చెప్పేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *