సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేసిన చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదో తెలుసా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగా స్టార్ చిరంజీవి గా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాత దేవీవరప్రసాద్ చిరంజీవి గారి తో ఎక్కువ సినిమాలు నిర్మించి హిట్స్ అందుకున్నారు.చిరంజీవి కి ముందు నిర్మాత దేవీవరప్రసాద్ గారు ఎన్టీఆర్ తో ఎన్నో హిట్ సినిమాలు చేసారు.ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి తో సినిమాలు చేసారు.

చిరంజీవి నటించిన ఘరానామొగుడు సినిమా హిట్ అయినా తర్వాత చిరంజీవి తోనే రెండు సంవత్సరాల తర్వాత ఇవివి సత్యనారాయణ కంబినేషన్లో దేవీవరప్రసాద్ అల్లుడా మజాకా చిత్రాన్ని నిర్మించారు.చిరంజీవి మరియు ఇవివి సత్యనారాయణ కలయికలో వచ్చిన మొదటి సినిమా అల్లుడా మజాకా.ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయినా అత్త పాత్ర కోసం ముందుగా వాణిశ్రీ ని అనుకున్నారట.కానీ ఆమె డేట్లు ఎడ్జస్ట్ కాకపోవడంతో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ని ఫైనల్ చేసారు.చిరంజీవి కు జోడిగా రమ్యకృష్ణ మరియు రంభ నటించారు.

Alluda Majaka
Alluda Majaka

సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాను 1994 ఆగష్టు 26 న క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.నిర్మాత దేవీవరప్రసాద్ మరియు ఎన్టీఆర్ గారికి మంచి సాన్నిహిత్యం ఉండడం కారణంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఈ చిత్రానికి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.ఆ తర్వాత 1995 ఫిబ్రవరి 25 న రిలీజ్ అయినా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *