Home సినిమా సీరియల్ గా కూడా పనికి రాదు అని చెప్పిన చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా...

సీరియల్ గా కూడా పనికి రాదు అని చెప్పిన చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో తెలుసా….

0

కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో చేసి సూపర్ హిట్ అందుకోవడం సర్వ సాధారణమే.కానీ సీరియల్ గా కూడా పనికి రాదు అని రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి రాజేంద్ర ప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఆ సినిమా రాజేంద్ర ప్రసాద్,ఆమని జంటగా నటించిన ఆ నలుగురు.దర్శకుడు మదన్ మదనపల్లి సమీపంలోని కొత్తపేటలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ కథను అనుకున్నారు.ఊరంతా అప్పులు చేసిన వ్యక్తి అంత్యక్రియలకు అందరు తరలి వచ్చి ఆయన అప్పుల గురించి కాకుండా మంచి గురించి మాట్లాడుకోవడం దర్శకుడు మదన్ ను ఆకట్టుకుంది.

డబ్బు కన్నా మానవతా విలువలు ప్రధానం అని చెప్పేలా ఒక స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు.దీనికి అంతిమయాత్ర అని పేరు కూడా పెట్టడం జరిగింది.ఆ తర్వాత ఈ కథతో సీరియల్ తీయవచ్చని ఈటీవీ కి పంపించడం జరిగింది.వారు సీరియల్ గా రిజెక్ట్ చేయడంతో అదే కథను కాస్త డెవలప్ చేసి భాగ్యరాజా దగ్గరకు తీసుకువెళ్లడం జరిగింది.అయితే ఈ సినిమాకు మోహన్ బాబు అయితే బాగుంటుంది అనుకున్నారు.ఆ తర్వాత ఇదే కథను ప్రకాష్ రాజ్ కు వినిపిస్తే కథ బాగుంది కానీ సినిమా గా పనికి రాదు అని రిజెక్ట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత తన స్నేహితుడు అయినా చంద్ర సిద్ధార్థ్ కు ఈ కథను వినిపించగా ఆయన తానే నిర్మిస్తాను అని చెప్పడం జరిగింది.ఈ సినిమా కథను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పగా అయ్యన కన్నీళ్లు పెట్టుకొని భావోగ్వేదానికి గురయ్యారు.ఈ సినిమా తాను నటిస్తాను అని చెప్పడం జరిగింది.హీరోయిన్ గా ఆమనీ,సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ ఫైనల్ అయ్యారు.సినిమా టైటిల్ ఆ నలుగురు గా ఫైనల్ చేసారు.ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ డైలాగులు అందరిని ఆకట్టుకున్నాయి.ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

Previous articleగుర్తుపట్టలేనంతగా మారిపోయిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి హీరోయిన్ ఆసిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…
Next articleతమ అభిమానినే పెళ్లి చేసుకున్న 6 మంది స్టార్లు ఎవరో తెలుసా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here