సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి హీరోయిన్ గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోయిన్లలో సింధు మీనన్ ఒకరు.మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్ చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్నారు.చిన్నతనంలోనే డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని విజేతగా నిలిచేవారు సింధు మీనన్.అదే సమయంలో ఆ ప్రోగ్రాం జడ్జి గా వ్యవహరిస్తున్న భాస్కర్ డైరెక్టర్ కె వి జయరాం కు సింధు మీనన్ ను పరిచయం చేయడం జరిగింది.జయరాం దర్శకత్వం వహించిన రశ్మి అనే కన్నడ చిత్రంతో సింధు మీనన్ 1994 లో సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన సింధు మీనన్ 1999 లో ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ చిత్రం తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.టాలీవుడ్ లో శ్రీహరి హీరోగా తెరకెక్కిన భద్రాచలం సినిమాతో 2001 లో హీరోయినిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సింధు మీనన్.ఆ తర్వాత తెలుగులో త్రినేత్రం,శ్రీరామచంద్రులు,ఇన్స్పెక్టర్,ఆడంటే అదో టైపు,చందమామ వంటి పలు సినిమాలలో నటించారు.చందమామ,వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సింధు మీనన్.
అలా తెలుగు,తమిళం,కన్నడ,మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటించారు.వంశం అనే మలయాళీ సీరియల్ లో కూడా సింధు మీనన్ నటించారు.పలు టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు.ఆ తర్వాత ఐటీ ప్రొఫెషనల్ అయినా డొమినిక్ ప్రభును 2010 లో వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు ఒక పాపా,ఒక బాబు ఉన్నారు.ఇటీవలే సింధు మీనన్ ఫ్యామిలీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.