Dhanush: షూటింగ్ స్పాట్ లో దిగిన అరుదైన ఫోటోలు,సినిమా తారల ముచ్చట్లు,చిట్ చాట్ లు అన్ని సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బాగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే హీరో హీరోయిన్ ల చిన్ననాటి ఫోటోలు,త్రో బ్యాక్ ఫోటోలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి.ప్రస్తుతం ఒక త్రో బ్యాక్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.వైరల్ అవుతున్న ఈ ఫొటోలో ఒక హీరో ఒక హీరోయిన్ ఉన్నారు.
అయితే హీరోను చూడగానే అతను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అంటూ అందరు ఈజీ గా గుర్తుపట్టేస్తున్నారు.అయితే ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టడం కొంచెం కష్టమే అని చెప్పచ్చు.ఎందుకంటె ఈమె తెలుగులో చేసింది రెండు సినిమాలు మాత్రమే.ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళ్ లో పది,కన్నడలో ఏడు,మలయాళంలో రెండు సినిమాలలో నటించడం జరిగింది.ఈ ఫొటోలో ధనుష్ పక్కన ఉన్న హీరోయిన్ షెరీన్ శ్రీనగర్.
ఈమె 2002 లో రిలీజ్ అయినా తమిళ చిత్రం తుల్లువదోళ్ళమయి అనే సినిమాలో హీరో ధనుష్ కు జోడిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాకు కస్తూరి రాజా దర్శకత్వం వహించారు.ఆ తర్వాత షెరీన్ పోలీస్ డాగ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ధ్రువ సినిమాతో కన్నడ ప్రేక్షకులను అలరించింది.ఇక తెలుగులో ఈమె జూనియర్స్,డేంజర్ సినిమాలలో నటించింది.