Shobha Shetty Engagement: సైలెంట్ గా నిశ్చితార్ధం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభా శెట్టి…ఫోటోలు వైరల్

NEWS DESK
2 Min Read
Shobha Shetty Engagement

Shobha Shetty Engagement: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.స్టార్ మా లో ప్రసారం అయినా కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా మోనిత పాత్రలో శోభా శెట్టి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో లో కూడా పాల్గొని తన క్రేజ్ ను మరింత పెంచుకుంది ఈ బ్యూటీ.ఈ షో ద్వారానే రెండు నెలల క్రితం తానూ ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేసింది శోభా శెట్టి.

Shobha Shetty Engagement

తాజాగా శోభా శెట్టి నిశ్చితార్ధానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.త్వరలో ఈమె పెళ్లి కూడా జరగనుందని సమాచారం.అయితే కార్తీక దీపం సీరియల్ లో ఈమె మోనిత పాత్రలో విలన్ అదరగొట్టింది.దాంతో మోనిత అంటే తెలియని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు.బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా పాల్గొని దాదాపుగా చివర వరకు వచ్చింది.

Shobha Shetty Engagement

ఈ షో ద్వారా నే తానూ ప్రేమించిన వ్యక్తి యశ్వంత్ రెడ్డి ని పరిచయం చేసింది శోభా శెట్టి.వీరిద్దరూ కలిసి కార్తీక దీపం సీరియల్ లో కలిసి నటించారు.యశ్వంత్ కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ కు తమ్ముడి పాత్రలో నటించారు.ఇక శోభా శెట్టి,యశ్వంత్ రెడ్డి కలిసి షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు.అలా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.అయితే వీరిద్దరూ నిశ్చితార్థం గత ఏడాదే జరగాల్సింది.

Also read : జర్నీ సినిమాలో హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో…ఏం చేస్తుందో తెలుసా…లేటెస్ట్ పిక్స్ వైరల్.!

Shobha Shetty Engagement

కానీ కొన్ని కారణాల వలన అది క్యాన్సిల్ అయ్యిందట.శోభా శెట్టి స్వయంగా ఈ విషయాన్నీ చెప్పడం జరిగింది.తాజాగా వీరిద్దరి నిశ్చితార్ధం బెంగళూరు లోని శోభా శెట్టి ఇంట్లో జరిగింది.వీరిద్దరూ దండాలు మార్చుకున్నారు.అయితే శోభా శెట్టి ఇది నిశ్చితార్ధం వేడుక అని వీడియొ లో ఎక్కడ కూడా చెప్పలేదు.తర్వాతి వీడియొ లో దీని గురించి చెప్తానని చెప్పుకొచ్చింది శోభా శెట్టి.ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

Also read : చెల్లెలి నిశ్చితార్ధం లో మాస్ డాన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి…వీడియొ వైరల్

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *