సైడ్ యాక్టర్ నుంచి స్టార్ హీరో,హీరోయిన్లుగా `మారిన 10 మంది నటి నటులు ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీ లో క్యారక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్లుగా మారిన వాళ్ళు చాల మందే ఉన్నారు.క్యారక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తమ నటనతో అందంతో స్టార్ లుగా మారి ఒక వెలుగు వెలుగుతుంటారు చాల మంది.ఇలా ఇండస్ట్రీలోకి సైడ్ యాక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా మారిన వాళ్ళు ఎవరంటే.

సాయి పల్లవి:శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు సాయి పల్లవి.సాయి పల్లవి హీరో విశాల్,మీరా జాస్మిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పందెం కోడి చిత్రంలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించడం జరిగింది.ఆ తర్వాత డాక్టర్ చదువు కోసం ఆస్ట్రియా వెళ్లడం జరిగింది.

త్రిష:హీరో ప్రభాస్ కు జోడిగా వర్షం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా త్రిష జోడి చిత్రంలో హీరోయిన్ సిమ్రాన్ కు ఫ్రెండ్ గా నటించింది.

రవి తేజ:సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసే వారు రవి తేజ.రాజశేఖర్ కు ఫ్రెండ్ గా రవి తేజ అల్లరి ప్రియుడు అనే చిత్రంలో నటించారు.ఆ తర్వాత కొన్ని సినిమాలలో రవి తేజ నెగటివ్ పాత్రలు కూడా చేయడం జరిగింది.

కాజల్:లక్ష్మీ కళ్యాణం అనే చిత్రం తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినా కాజల్ క్యూ హోగయా నా లో ఐశ్వర్య రాయ్ కు ఫ్రెండ్ గా నటించడం జరిగింది.
రీతూ వర్మ:పెళ్లి చూపులు అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మ బాద్షా చిత్రంలో హీరోయిన్ కాజల్ కు చెల్లెలిగా నటించింది.

విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారారు.విజయ్ దేవరకొండ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా చిత్రంలో మరియు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంలో చిన్న చిన్న పాత్రలలో కనిపించడం జరిగింది.హీరో నాని కు ఫ్రెండ్ గా ఎవడే సుభ్రమణ్యం అనే  చిత్రంలో కూడా విజయ్ దేవరకొండ నటించారు.

శర్వానంద్:శర్వానంద్ పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించాడు.యువసేన చిత్రంలో నలుగురు హీరోలలో ఒకడిగా కూడా శర్వానంద్ చేసారు.

విజయ్ సేతుపతి:ఉప్పెన చిత్రం తర్వాత తమిళ్ హీరో విజయ్ సేతుపతి కి తెలుగులో డిమాండ్ బాగా పెరిగింది.పిజ్జా,నేను రౌడీ అనే డబ్బింగ్ చిత్రాలతో కూడా తెలుగు గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి.విజయ్ సేతుపతి ధనుష్,కార్తీ,జయం రవి వంటి పలు హీరోల చిత్రాలలో సైడ్ క్యారక్టర్ గా చేయడం జరిగింది.

నవీన్ పోలిశెట్టి:ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రంలో విజయ్ దేవరకొండకు ఫ్రెండ్ గా నటించడం జరిగింది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా చిచోరే లో కూడా నవీన్ పోలిశెట్టి నటించడం జరిగింది.

అనసూయ:ప్రస్తుతం తెలుగు లో టాప్ యాంకర్లలో ఒకరైన అనసూయ ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు.అనసూయ హీరో ఎన్టీఆర్ నాగ చిత్రంలో స్టూడెంట్ గా నటించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *