Lingi Lingi Lingidi : శ్రీకాకుళం జానపద పాటలకు ఆంధ్రప్రదేశ్ లో చాల ప్రాచుర్యం ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ప్రజలు జానపద గాయకుల సంస్కృతీ,ప్రతిభను మెచ్చుకొని ఆ పాటలను బాగా ఎంజాయ్ చేస్తారు.అలా కొన్ని జానపద పాటలు ఎంతగా ఆదరణ పొందాయంటే వాటిని భారీ బడ్జెట్ సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు వాడేశారు.ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ శ్రీకాకుళం జానపద పాటలను హిట్ సాంగ్స్ గా తీర్చిదిద్దారు.పలాస సినిమాలోని నాది నక్కిలిసు గొలుసు అనే పాట ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఈ శ్రీకాకుళం జానపదం పాట ఒక సంచలనం అని చెప్పచ్చు.మరొక శ్రీకాకుళం జానపద పాట పల్సర్ బైక్ సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది.ఈ పాటను రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో వాడారు.ఇప్పుడు లేటెస్ట్ గా మరో శ్రీకాకుళం జానపద పాట సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకుంటుంది.లింగ్ లింగ్ లింగ్ లింగ్ లింగడి అనే ఈ శ్రీకాకుళం జానపద పాటను గీత ఆర్ట్స్ నిర్మించిన కోట బొమ్మాలి పీఎస్ సినిమాలో చేర్చటం జరిగింది.ఇప్పటికే ఆన్లైన్ లో రిలీజ్ అయినా ఈ పాట సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో ట్రేండింగ్ గా మారింది.చాల మందికి ఈ పాట నచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటె కొంత మంది మాత్రం పెదవి విరుస్తున్నారు.శ్రీకాకుళానికి చెందిన జానపద గాయకుడు మల్లేష్ ఈ పాట తానూ క్రియేట్ చేసిన ఒరిజినల్ సాంగ్ అని చెప్పడం జరిగింది.
ఈ పాట ను తన అనుమతి లేకుండా కాపీ చేసారని మల్లేష్ ఆరోపిస్తున్నాడు.40 ఏళ్ళ క్రితం తానూ ఈ పాటను రాసానని వివిధ ఇళ్లలో కుమ్మరి పని చేస్తూ జీవనోపాధి పొందేవాడినని మల్లేష్ చెప్పుకొచ్చాడు.సినిమా యూనిట్ తన పాటను ఉపయోగించుకున్న సంగతి తనకు తెలియదని తెలిసాక చాల బాధపడ్డానని మల్లేష్ తెలిపాడు.తనకు ఎలాంటి క్రెడిట్ కానీ పరిహారం కానీ ఇవ్వలేదని తన ఆవేదనను మీడియా ముందు తెలుపుతూ తన పనికి న్యాయం చేయాలనీ కోరాడు.మల్లేష్ ఆరోపణలపై సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇక గతంలోనూ కూడా సారంగదరియా పాటను కాపీ చేసారని ఒక గాయకురాలు మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన సంగతి అందరికి తెలిసిందే.