తెలుగు ప్రేక్షకులకు సిరి హన్మంత్ బాగా పరిచయం ఉన్న పేరు.తన అందంతో,యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను యిట్టె కట్టి పడేస్తుంది సిరి హన్మంత్.యూట్యూబ్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న సిరి,ఆ తర్వాత వెబ్ సిరీస్ లలో మరియు సీరియల్స్ లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.రియాలిటీ షో అయినా బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశాన్ని దక్కించుకొని క్రేజ్ ను సంపాదించుకుంది.సిరి ఇద్దరి లోకం ఒకటే,ఒరేయ్ బుజ్జిగా వంటి సినిమాలలో కూడా నటించింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ సిరి ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన లేటెస్ట్ ఫోటోలను మరియు వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఎప్పటికప్పుడు తన వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ అమ్మడు.తాజాగా ఈమె స్టార్ మా పరివారం బుల్లితెర షో లో పాల్గొని తన మాస్ డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది.ఈ షో కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది.ఇక ఈ షో లో సిరితో పాటు సన్నీ,మానస్,ఆర్జే కాజల్,అమ్మ రాజశేఖర్,అరియనా గ్లోరీ,నోయెల్,ముక్కు అవినాష్ కూడా పాల్గొనడం జరిగింది.
ఈ షోలో పాల్గొన్న సిరి ఒక టాస్క్ లో భాగంగా మాస్ స్టెప్పులు వేయడం జరిగింది.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది సినిమాలోని బాపు గారి బొమ్మో అనే సాంగ్ కు సిరి డాన్స్ చేయడం జరిగింది.మొదట క్లాస్ స్టెప్పులతో ప్రారంభించిన సిరి ఆ తర్వాత మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది.అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ మాస్ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.