టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన నటనతో,అందంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మహేష్ బాబు.ఇటీవలే రిలీజ్ అయినా మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో మరింత అందంగా కనిపించిన సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబు కు యెంత ఫాలోయింగ్ ఉందొ మహేష్ గారాల పట్టి సితార ఘట్టమనేని కి కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పచ్చు.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ సితార అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.ఇటీవలే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన సితార తన బెస్ట్ ఫ్రెండ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది.
తన బెస్ట్ ఫ్రెండ్ అంతే తనకు చాల ఇష్టమని,ఆమెతో టైం స్పెండ్ చేయడం అంటే కూడా ఇష్టమని సితార చెప్పుకొచ్చింది.ఇప్పుడు ప్రస్తుతం సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతుంది.సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా సమంత.సితార కు సమంత అంటే చాల ఇష్టమట…ఆమెతో టైం గడపడమంటే కూడా ఇష్టమని చెప్పుకొచ్చింది సితార.బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ టైములో సమంత తో సరదాగా గడిపానని సితార తెలిపింది.
సితార సమంత గురించి మాట్లాడుతూ సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలు లాంటి వారు.మా నాన్నగారి సినిమాలలో నటించారు.6 ఏళ్ళ క్రితం సమంత తో సరదాగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకోవడం చాల సరదాగా ఉంది అని సితార చెప్పుకొచ్చింది.ఇటీవలే సితార సర్కారు వారి పాట చిత్రం ఆల్బం పెన్నీ సాంగ్ ప్రమోషన్లో కనిపించిన సంగతి అందరికి తెలిసిందే.మహేష్ బాబు కూడా తన కూతురు పెద్ద హీరోయిన్ అవుతుంది అని చెప్పుకొచ్చారు.అయితే త్వరలోనే సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేసారు.