Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు.సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే సితార తన డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.సితార కు సోషల్ మీడియాలో చాల క్రేజ్ ఫాలోయింగ్ ఉన్నాయి.తాజాగా సితార సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా అనే పాటకు లంగావోణీ వేసుకొని స్టెప్పులు వేసింది.సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తన నటనతో,సామజిక సేవలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్ ను ప్రారంభించి పుట్టకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి తల్లి తండ్రులకు అండగా నిలిచి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతున్నారు.పిల్లలతో టైం ఎక్కువగా స్పెండ్ చేసే మహేష్ బాబు కు తన గారాల పట్టి సితార అంటే అమితమైన ఇష్టం.ఇక సితార కూడా తనకు సంబంధించిన వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది.
సితార తండ్రి కి తగిన కూతురిగా ఇటీవలే ఒక ప్రముఖ జ్యూవెలరీ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం కూడా చేసింది.కొంత కాలం నుంచి ఒక డాన్స్ మాస్టర్ సమక్షంలో డాన్స్ నేర్చుకుంటున్న సితార తాజాగా సారంగదరియా పాటకు డాన్స్ చేసి అందరిని ఆకట్టుకుంటుంది.లంగావోణీ లో అదిరిపోయే స్టెప్పులతో సితార చేసిన డాన్స్ వీడియొ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు డాన్స్ సూపర్ గా చేసావ్ అని మరికొందరేమో ఫ్యూచర్ హీరోయిన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram