రాత్రిపూట నిద్రలో ఉన్న సమయంలో ఛాతి మీద ఏదో ఉన్నట్లు అనిపించిందా…అది ఏంటో తెలుసా…

ప్రతి ఒక్కరికి నిద్రించే సమయంలో కలలు రావడం అనేది సహజం.కొంతమంది అయితే పగటిపూట కూడా కలలు కంటూ ఉంటారు.అయితే కొంత మందికి రాత్రి పూట నిద్రపోతున్నప్పుడు పీడకలలు వస్తుంటాయి.అలా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా ఎవరో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు చాల మందికి అనిపిస్తూ ఉంటుంది.గొంతు పట్టుకున్నట్లు కూడా అనిపిస్తుంది.ఇక ఆ సమయంలో కళ్ళు కానీ చేతులు కానీ కదిలించాలి అనుకున్న కదిలించలేము.నోట్లో నుంచి మాట కూడా బయటకు రాదు.

ఇలాంటి సంఘటన చాల మందికి జరిగే ఉంటుంది.అయితే అసలు ఇలా ఎందుకు జరుగుంతుంది..ఇలా జరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని చాల మంది ఆలోచిస్తుంటారు.అయితే అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏదో వచ్చి ఛాతి మీద కుర్చునట్లు అనిపించడం…ఎటూ కదల లేని పరిస్థితి..నోట్లో నుంచి మాటలు కూడా బయటకు రావు.అయితే దీన్నే స్లీప్ పరలాసిస్ అని అంటారంట.అయితే ఒక మనిషి సగటు ఆయుర్ధాయం 75 ఏళ్ళు అనుకుంటే ప్రతి ఒకరికి ఇలాంటి కలలు ఎప్పుడో ఒకసారి వస్తాయంట.

అయితే గాఢ నిద్రలో ఉన్న సమయంలో లేక నిద్రనుంచి లేచే సమయంలో స్లీప్ పరలాసిస్ సంభవిస్తుందని నిపుణులు చెప్పడం జరిగింది.అయితే ఇలా జరగడానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమి ఉండవు.ఇలా ఎందుకు జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు.కానీ ప్రతి ఒకరికి ఇలా జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.స్లీప్ పరలాసిస్ సుమారుగా 80 సెకన్ల వరకు ఉంటుందట.అయితే అమెరికా లో ఏటా ఒక శాతం జనాభాకు ఇలాంటి కలలు వస్తుంటాయని సర్వేలలో చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *