సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవకాశాలు రావాలంటే మాములు విషయం కాదు.సినిమా అవకాశాలు దక్కించుకోవాలంటే ఎంతో కష్టపడాలి.ఎంతో కృషితో పట్టుదలతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వాళ్ళు చాల మందే ఉన్నారు.చాల సినిమాలలో స్నేహితుడిగా,అన్నయ్యగా,విలన్ గా క్యారక్టర్ ఆర్టిస్ట్ మంచి గుర్తింపు సంపాదించుకున్న అజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తనదైన శైలిలో నటించి ప్రేక్షకులకు దగ్గరయిన అజయ్ ప్రస్తుతం సినిమాలలో కనిపించటం లేదు.ఇరవై రెండేళ్ల నుంచి నటిస్తున్న అజయ్ ఆ తర్వాత తనకు తగిన పాత్ర రాకపోతే రిజెక్ట్ చేసేవారు.
అలా చాల గ్యాప్ తర్వాత అజయ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అజయ్.అజయ్ 19 ఏళ్ళ వయస్సులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేపాల్ వెళ్లారట.ఆ తర్వాత నేపాల్ లో డబ్బులు లేక గిన్నెలు తోమి ఆ సంపాదించినా డబ్బు తో ఇంటికి వచ్చారంట.తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదురుకొని ఎంతో శ్రమ పడి అవకాశాలు దక్కించుకున్న వాళ్లలో అజయ్ కూడా ఒకరు.తనకు తగిన పాత్రలు రాకపోతే అజయ్ నో చెప్పేస్తారట.

అజయ్ హీరో రవితేజ విక్రమార్కుడు సినిమాలో చేసిన విలన్ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేసే అజయ్ తో విలన్ పాత్రలో నటింపచేసి సక్సెస్ సాధించడం రాజామౌళికే సాధ్యమైంది అని చెప్పచ్చు.అయితే తనకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు అజయ్ తెలిపారు.9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అజయ్ ఇన్ని రోజులు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.తనకు తగిన పాత్రలు వస్తే నటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అజయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.