ఎన్టీఆర్ పెళ్లి కట్నం ఎంతో తెలుసా…పెళ్లి సమయంలో వారి ఏజ్ అంత తక్కువనా…

NEWS DESK
2 Min Read
Jr NTR Marriage Photos

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.ఇటీవలే రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.ప్రస్తుతం ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ లలో ఎన్టీఆర్,లక్ష్మి ప్రణతి దంపతులు మొదటి స్థానంలో ఉన్నారని చెప్పచ్చు.జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి తగ్గట్లుగా లక్ష్మి ప్రణతి వచ్చిందని అందరు భావిస్తున్నారు.పెద్దల సమక్షంలో వీరిద్దరి వివాహం 2011 మే 6 న అంగరంగ వైభవంగా జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనవంతుడు అయినా బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మి ప్రణతి.అప్పట్లో ఈ సంబంధాన్ని చంద్రబాబు నాయుడు గారే చూసారని…దగ్గరుండి పెళ్లి కూడా చేసారని ప్రచారం జరిగింది.అప్పట్లో వీరిద్దరి వివాహం సమయంలో ఎన్టీఆర్ కు లక్ష్మి ప్రణతి కుటుంబం దాదాపుగా 250 కోట్లు విలువైన భూములను ఇచ్చారని వార్తలు వచ్చాయి.వీటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా రాసిచ్చారని..అవన్నీ కలిపితే 1200 కోట్లు వరకు నార్నె శ్రీనివాసరావు గారు ఇచ్చారని వార్తలు వచ్చాయి.వీరి పెళ్లి సమయంలో వయస్సు గురించి కూడా చర్చలు జరిగాయి.

ఎన్టీఆర్ అంటే పడని కొంత మంది ఆయన చాల చిన్న అమ్మాయిని వివాహం చేసుకుంటున్నారని ప్రచారం చేసారు.అప్పట్లో ఆయన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటున్నారని కూడా బాగా ప్రచారం జరిగింది.అసలు నిజం ఏంటంటే లక్ష్మి ప్రణతి పెళ్ళికి ముందే మేజర్ అయ్యారు.వీరిద్దరి వివాహం చట్ట ప్రకారమే జరిగింది.ఆ తర్వాత ఎంక్వయిరీ లో ఎన్టీఆర్ అంటే పడని కొంత మంది తప్పుడు ప్రచారం చేసారని తేలింది.వీరిద్దరూ వివాహం చేసుకొని ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్ లో అన్యోన్యమైన జంటగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఎన్టీఆర్ ను అర్ధం చేసుకునే మంచి భార్య దొరికింది అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *