Satyadev: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరో సత్యదేవ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొదట క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత హీరోగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.హీరో గానే కాకుండా విలన్ కూడా చేస్తూ సత్యదేవ్ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు.ఇక సత్యదేవ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించడం జరిగింది.
సత్యదేవ్ హీరోగా నటించిన శీతాకాలం సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.సత్యదేవ్ గురించి ఆయన నటన గురించి ప్రేక్షకులకు బాగా తెలుగు కానీ సత్యదేవ్ ఫ్యామిలీ గురించి చాల మందికి తెలియకపోవచ్చు.సత్యదేవ్ సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో సినిమాల మీద ఆసక్తి తో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది.
అలా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఆ తర్వాత సినిమాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.కానీ ఆయనకు పెళ్లి కాలేదు అని చాల మంది అనుకుంటున్నారు.సత్యదేవ్ కు పెళ్లి అయి పిల్లలు ఉన్నారనే సంగతి చాల మందికి తెలియదు అని చెప్పచ్చు.శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ తమన్నా సత్యదేవ్ భార్య ను పరిచయం చేయడం జరిగింది.ప్రస్తుతం సత్యదేవ్ భార్య దీపికా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.