గత కొంత కాలం నుంచి సినిమా రంగంలోని కొంత మంది జంటలు విడాకుల వార్తలతో చర్చలో నిలుస్తున్నారు.ప్రేమించి వివాహం చేసుకున్న కూడా కొన్ని కారణాల వలన ఈ జంటలు విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం వీరు రివీల్ చేయరు.ఇటీవలే ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంత జంట విడాకుల ముందు చర్చల్లో నిలిచినా సంగతి అందరికి తెలిసిందే.
అయితే అందరు ఊహించినట్లే వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక గా ప్రకటించారు.కానీ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఇద్దరు చెప్పలేదు.అలాగే కోలీవుడ్ స్టార్ జంట అయినా ఐశ్వర్య ధనుష్ కూడా విడాకులు తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అలాగే బాలీవూడ్ లో కూడా అమిర్ ఖాన్ దంపతులు విడాకులు తీసుకోవడం ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ స్టార్ జంట విడాకులు తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్లుగా పేరుతెచ్చుకున్న హేమ చంద్ర,శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.2013 లో ఈ జంట వివాహం చేసుకున్నారు.అయితే పెళ్లి జరిగి పది సంవత్సరాలు కలిసుండకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఈ విషయం పై స్పందించిన జంట క్లారిటీ ఇవ్వడం జరిగింది.
హేమచంద్ర ఈ విషయం స్పందిస్తూ నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే కూడా స్టుపిడ్ మరియు అనవసరమైన సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.నా ఇంస్టాగ్రామ్ బయో లో ఓ ఇండిపెండెంట్ లవ్ సాంగ్ ఉంది దాన్ని వీక్షించండి అంటూ హేమచంద్ర పోస్ట్ చేసారు.ఈ విషయంపై స్పందించిన శ్రావణ భార్గవి…కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్ లో వ్యూస్ పెరిగాయి..ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు.నాకు ఇప్పుడు ఎక్కువ పని దొరికింది.గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను.ఇది ఒక రకంగా శుభపరిణామం.తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం అంటూ కామెంట్ చేసారు.అయితే మొత్తంగా తమపై వస్తున్నా వార్తలు అబద్దం అన్నట్లు పరోక్షంగా తెలిపారు ఈ జంట.
