ఈ ఫొటోలో ఉన్న నటుడు ఎవరో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.కానీ అతను ఎవరో గుర్తించడానికి మాత్రం కొంత సమయం పడుతుంది అని చెప్పచ్చు.అతను ఎవరో గుర్తించిన తర్వాత మీకు కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అని చెప్పచ్చు.అతను మరెవరో కాదు ఎన్నో కోట్లను మంది అభిమానులను సంపాదించుకొని అందరికి దూరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా నటుడు రియల్ స్టార్ శ్రీహరి.ఈ ఫోటోను చూసిన తర్వాత ఈయనకు ఏమైంది అనే బాధ అందరిలోనూ కలుగుతుంది.ఆయన చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన ఆరోగ్యం బాగా క్షిణించింది.
ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఎవరు వచ్చిన కూడా నవ్వుతూ పలకరించేవారు శ్రీహరి.ప్రస్తుతం ఉన్న హీరోలు అయినా చిన్న చిన్న ఆర్టిస్ట్ లు అయినా ఎవరైనా కలవడానికి వస్తే బిల్డప్ చూపించిన డ్రామా చేస్తూ ఉంటారు.కానీ శ్రీహరి అలా కాదు అని చెప్పచ్చు.తనను కలవడానికి వచ్చిన అభిమానులను నవ్వుతూ ముచ్చటించేవారని సమాచారం.అందుకే ఆయన ప్రేక్షకులకు రియల్ స్టార్ గా మారారని చెప్పచ్చు.శ్రీహరి గారు తన ఆరోగ్యం బాగోలేని రోజులలో ఒక చిన్న సినిమావారు వచ్చి ఆడియో ఫంక్షన్ కి పిలిస్తే అసలు విషయం చెప్పకుండా ఆడియో ఫంక్షన్ కి వచ్చారు శ్రీహరి.
శ్రీహరి అనారోగ్యం ఆయన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీహరి గారు మేడ్చల్ లో తాగు నీటి సమస్య లేకుండా చేసారు.ఆయన చనిపోయిన తన కూతురి పేరు మీద ఫౌండేషన్ స్థాపించి చాల మందికి సహాయం అందించారు.ఇక ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఉన్నంతలో ఈ సేవను కొనసాగిస్తున్నారు.శ్రీహరి కొడుకులు కూడా ఒకరు హీరోగా మరియు ఇంకొకరు దర్శకుడిగా సినిమాలలోకి రావాలని ఆశిస్తున్నారు.