మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్..ఎవరో తెలుసా….

చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు.అలా ఇండస్ట్రీలో మూడేళ్ళ వయస్సులోనే నటన ప్రారంభించిన ఈ చిన్నారి ఆ తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వాళ్ళల్లో ఈ చిన్నారి కూడా ఉంది.ఈ చిన్ననాటి ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నారి ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్.ఈమె పలు సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది.2000 లో రిలీజ్ అయినా హనుమాన్ జంక్షన్ అనే సినిమాలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.

హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు,అర్జున్ హీరోలుగా నటించగా,స్నేహ,లయ హీరోయిన్లుగా చేసారు.అదే సంవత్సరం మహేష్ బాబు హీరోగా చేసిన యువరాజు సినిమాలో కూడా ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.ఇక ఈమె చైల్డ్ హీరో రవి తేజ మూవీ అయినా వీడే లో కూడా నటించడం జరిగింది.ఆ తర్వాత తన దృష్టి మొత్తాన్ని చదువులపై పెట్టింది.ఇక ఆ తర్వాత 2010 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు సినిమాలలో నటించింది.

కార్తీ,శివకార్తికేయన్,జి వి ప్రకాష్ వంటి హీరోలకు జోడిగా నటించింది.ఈ చిన్నారి ఎవరో కాదు శ్రీ దివ్య.రవి బాబు దర్శకత్వంలో మనసారా చిత్రంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య.ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది శ్రీదివ్య.ఆ తర్వాత శ్రీదివ్య మల్లెల తీరంలో సిరిమల్లె పూవు,వారధి,కేరింత వంటి సినిమాలలో నటించడం జరిగింది.ఇక కేరింత సినిమా తర్వాత శ్రీదివ్య పూర్తిగా తమిళ్ సినిమాల మీదనే దృష్టి పెట్టడం జరిగిని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *