పుష్ప సామీ సామీ పాటకు శ్రీలీల మాస్ డాన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…వీడియొ వైరల్…

టాలీవుడ్ లో పెళ్లి సంద D సినిమాతో బాగా క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల.మొదటి సినిమాతోనే తన అందంతో,నటనతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఈ సినిమా తర్వాత ఆమె వరుస అవకాశాలతో బిజీ గా గడుపుతుంది.ప్రస్తుతం ఈమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ లో జరిగే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా హీరో హీరోయిన్ అదిరిపోయే డ్రెస్సింగ్ లుక్ లో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.

తమ సినిమాలలోని పాటలే కాకుండా ట్రేండింగ్ లో ఉన్న పాటలకు కూడా డాన్స్ చేసి వావ్ అనిపిస్తారు నటీనటులు.తాజాగా సైమా అవార్డ్స్ లో యంగ్ హీరోయిన్ శ్రీలీల పుష్ప సినిమాలోనే సామీ సామీ పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈమె చేసిన మాస్ డాన్స్ వీడియొ నెట్టింట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

సైమా అవార్డ్స్ 2022 లో సౌత్ ఇండియన్ సెలెబ్రెటీలు అందరు కూడా తమ స్టైల్ లో పెర్ఫార్మ్ చేయడం జరిగింది.శ్రీలీల చేసిన మాస్ డాన్స్ కు ఆమె ఫ్యాన్స్ తో పాటు పుష్ప ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.శ్రీలీల హీరో రవితేజ కు జోడిగా ధమాకా సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుందని సమాచారం.ఇక ఈమె నవీన్ పోలిశెట్టి కి జోడిగా అనగనగా ఒక రాజు సినిమాలో కూడా నటిస్తుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *