ఊ అంటావా మావ పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన శ్రీముఖి డాన్స్ వీడియొ వైరల్…

బుల్లితెర మీద ఉన్న గ్లామరస్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పచ్చు.గ్లామరస్ బ్యూటీ లుగా పేరుతెచ్చుకున్న వాళ్లలో అనసూయ,రష్మీ గౌతమ్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది శ్రీముఖి.తన యాంకరింగ్ తో ఫుల్ ఆక్టివ్ గా స్టేజి మీద సందడి చేసే శ్రీముఖి తన కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా గ్లామర్ షో కు దూరంగా ఉంటూ వస్తుంది.టీవీ షోలలో యాంకరింగ్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ వస్తుంది శ్రీముఖి.అయితే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ రియాలిటీ షో లో కూడా పాల్గొని రన్నర్ అప్ గా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

అయితే తాజాగా శ్రీముఖి పుష్ప సినిమాలోని ఊ అంటావా ఉహు అంటావా అనే పాటకు స్టేజి మీద గ్లామరస్ పెర్ఫార్మన్స్ చేసింది.త్వరలో తెలుగు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫారం అయినా ఆహా లో ఒక డాన్స్ షో ప్రారంభం కాబోతుంది.డాన్స్ ఐకాన్ గా రాబోతున్న ఈ షో కు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.సెప్టెంబర్ 11 న ప్రారంభం కాబోతున్న ఈ షో లో ఒక టీం లీడర్ గా శ్రీముఖి కనిపించనుంది.

అయితే ఈ షో లో స్పెషల్ పెర్ఫార్మన్స్ శ్రీముఖి ఎంట్రీ ఇవ్వనుంది.పుష్ప సినిమాలోని ఊ అంటావా ఉహు అంటావా అనే పాటకు డాన్సర్ తో కలిసి ఇంటెన్స్ స్టెప్పులు వేసింది శ్రీముఖి.ఆ తర్వాత శేఖర్ మాస్టర్ తో హాట్ స్టెప్పులు వేసి అదరగొట్టింది శ్రీముఖి.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో చాల స్పీడ్ గా వైరల్ అవుతుంది.శ్రీముఖి పెర్ఫార్మన్స్ పై నిర్మాత అల్లు అరవింద్ మరియు శేఖర్ మాస్టర్ ప్రశంసల వర్షం కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *