బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి గురించి పెద్దగా పరియడం అక్కర్లేదు. యాంకరింగ్ తో వీక్షకులను కట్టి పడేస్తుంది ఈ బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ. సినిమాల్లో కూడా నటిస్తూ కేక పుట్టిస్తుంది శ్రీముఖి. తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా రన్నరప్ గా నిలిచిన ఈ అమ్మాయి తన ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ తో ఫ్రైజ్ మనీని కూడా పంచుకుంది. తాజాగా శ్రీముఖి నెట్టింట్లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నారు.
అందం, అభినయం, చురుకైన మాటలతో తెలుగు వారిని అలరిస్తూ బుల్లితెరలో తన మార్కును వేసుకుంది శ్రీముఖి. టీవీల్లో యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా అప్పుడప్పుడూ అలరిస్తూనే ఉంది. అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులే తెచ్చుకుంటోంది. షో, ఈవెంట్ ఏదైనా ఆమె మార్కుతో జనాలను కుర్చీలకు అతుక్కునేలా చేస్తుంది. ఆమె ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో పాటకు వేసిన డ్యాన్స్ తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘బుల్లితెర రాములమ్మ’గా పిలుచుకుంటారు.
వరుస షోలు, ఈవెంట్లతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఆమె ఆ మేరకే బిజీగా ఉన్నారు. ఒక వీడియోను సోషల్ మీడియాలో వదిలింది శ్రీముఖి. ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ స్టేజీని ప్రముఖ హీరో, కమేడియన్ అలీతో పంచుకుంది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ కూడా వచ్చారు.రణవీర్ డయాస్ నుంచి వెళ్లిపోతుండగా శ్రీముఖి అతడిని పిలిచి హగ్ చేసుకోవాలని ఉంది అని కోరింది. దీంతో రణవీర్ హగ్ తో పాటు ముద్దు కూడా పెట్టారు. ఈ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ చేసింది బుల్లితెర రాములమ్మ.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఆమె ఓ ఫొటో షూట్ చేసి అదరగొట్టింది. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. దీనికి నెటిజన్స్ ఫిదా అయ్యారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శ్రీముఖి ఒక ఒకరితో రిలేషన్ లో ఉందన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె ఇంత వరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె అభిమానులు మాత్రం బుల్లితెర రాములమ్మ ప్రేమించి పెండ్లి చేసుకుంటుంది అంటూ భావిస్తున్నారు. వీటికి కాలమే సమాధానం చెప్పాలి.
ఆమె ‘ఇట్స్ టైం టూ పార్టీ’ అనే సినిమాలో కూడా చేసింది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’ ఇది మళయాలీ మూవీ ‘గాడ్ ఫాదర్’కు రీమేక్. ఈ సినిమాలో కూడా శ్రీముఖి ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన మరో కీలక పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తే హీరోయిన్ గా తమన్నా చేస్తుంది.తమన్నా గతంలో చిరంజీవి సరసన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’లో నటించింది. ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. గతేడాది నవంబర్ లో ప్రారంభమైన షూటింగ్ మొదటి దశ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా పరుగులు పెట్టిస్తున్నారంట చిత్ర యూనిట్. మళయాలంలో సూపర్ హిట్టైన లూసిఫర్ చిత్రాన్ని ఆర్ బీ చైదరీ, ఎన్ వీ ప్రసాద్ రీమేక్ చేస్తున్నారు. చిరంజీవి కోసం లూసిఫర్ కథలో కొన్ని మార్పులు కూడా చేశారంటా. ఇది ఏ మేరకు సినీ అభిమానులను అలరిస్తుందో చూడాలి మరి.
View this post on Instagram