టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.ఈమె 2021 లో రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పెళ్ళిసందడి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఈమె తెలుగుతో పాటు కన్నడలో కూడా సినిమాలు చేస్తుంది.ఈమె 2019 లో కిస్ సినిమాకు కన్నడ ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు ను గెలుచుకున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నప్పటికీ బెంగళూరు లో పెరిగినందున కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను మొదలు పెట్టాలి అని అనుకున్నట్లు శ్రీలీల చెప్పుకొచ్చారు.
2019 లో రిలీజ్ అయినా శ్రీలీల కిస్ సినిమా విజయం సాధించింది.దింతో శ్రీలీల కన్నడ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఆ తర్వాత ఆమె తెలుగులో పెళ్ళిసందడి సినిమాలో తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది అని చెప్పచ్చు.
ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా కూడా ఆమెకు సినిమా అవకాశాలు మాత్రం క్యూ కట్టాయి అని చెప్పచ్చు.ప్రస్తుతం శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ కు జోడిగా నటించిన ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తాజాగా శ్రీలీల శ్రీముఖి తో కలిసి చేసిన ఎనర్జిటిక్ డాన్స్ వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోలో శ్రీముఖి తో కలిసి శ్రీలీల స్టెప్పులేయడం జరిగింది.