తెలుగు యాంకర్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. పటస్ కు గతంలో హోస్ట్ (బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లే ముందు) గా కూడా వ్యవహరించింది. దీంతో పాటు ఈ టీవీ, మా టీవీ, జీ టీవీ, తదితర చానళ్లలో స్పెషల్ షోలను చేస్తూనే ఉంటుంది. ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యాంకరింగ్ లో ఆమె చరుకుదనం నచ్చని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ఇదే ఆమెకు లక్షలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ‘ఒసేయ్ రాములమ్మ’ మూవీలో ఒక పాటకు ఆమె డ్యాన్స్ బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన శ్రీముఖి ప్రస్తుతం సందడి చేస్తూ కనిపిస్తోంది.
ఆమె శేఖర్ మాస్టర్ తో డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ – 3లో అమ్మడు హౌజ్ లో సందడి చేసింది. అత్యధిక పారితోషికం తీసుకున్నది ఈ ముద్దుగుమ్మనే అంటూ ఊహాగానాలు కూడా వినిపస్తున్నాయి. బిగ్ బాస్ హౌజ్ లో 105 రోజులు ఉన్నందుకు గానూ ఆమె దాదాపు రూ. 80 లక్షలు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిపి శ్రీముఖి రూ. 50 లక్షల చెక్కును అందుకుందట. రాహుల్ కు, శ్రీముఖికి ఈ షో బాగా ప్లస్ అయ్యిందనే చెప్పాలి.

ఒకే ఇంట్లో అన్ని రోజులు ఉండాలంటే మానసికంగా బాగా ఫిట్ నెస్ కావాలంటుంది శ్రీముఖి. మనం మన కుటుంబ సభ్యులతో మెలిగే విధానం ఇందులో బాహాటంగా ప్రేక్షకులకు తెలుస్తుందని చెప్తోంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గానే ఉంటుంది. తన ఇన్ స్టా, ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారంటే ఆమె క్రేజ్ మనకు ఇట్టే అర్థమవుతుంది. ట్రెండ్ ను బాగా ఫాలో అవుతుందట. ఎప్పుడు ఏది క్రేజ్ దేనిపై వీడియో చేస్తే జనాల్లోకి వెళ్తుందో శ్రీముఖి ఇట్టే పట్టుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్ తో కలిసి చేసిన డ్యాన్స్ పై ఇప్పుడు వైరల్ అవుతోంది.