Shruti Hassan: ఈ ఫొటోలో ఎంతో అందంగా ఉన్న చిన్నారి ముందు సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమెది ఐరన్ లెగ్ అని ట్రోల్ చేసారు చాల మంది.తండ్రి అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవటంలో సక్సెస్ అయ్యింది.దాదాపు స్టార్ హీరోలందరికీ జోడిగా ఈ ముద్దుగుమ్మ నటించడం జరిగింది.ఈ చిన్ననాటి ఫొటోలో ఉన్న ఇప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో కాదు తమిళ స్టార్ హీరో,విలక్షణ నటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్.
తండ్రి హీరోగా చేసిన హే రామ్ సినిమాలో ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.ఆ తర్వాత 2009 లక్ సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో 2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాలో హీరో సిద్ధార్థ్ కు జోడిగా నటించింది శృతి హాసన్.తెలుగులో సెవెంత్ సెన్స్,ఓ మై ఫ్రెండ్,త్రి వంటి సినిమాలు చేసిన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.పవన్ కళ్యాణ్ కు జోడిగా గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ కు ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.
ఆ తర్వాత ఈమె బలుపు,ఎవడు,రేసుగుర్రం,ఆగడు,శ్