Home సినిమా రాజమౌళి,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయినా ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…

రాజమౌళి,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయినా ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…

0
Pawan Kalyan at Cameraman Ganga Tho Rambabu Movie Opening Stills

తెలుగు సినిమా కీర్తిని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి.బాహుబలి సినిమాతో ఆయన ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు.ఇటీవలే రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఘన విజయం సాధించి కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో రామ్ చరణ్,ఎన్టీఆర్ లు అల్లు సీతారామరాజు మరియు కొమరం భీం పాత్రలలో అద్భుతమైన నటన కనపరిచారు.దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయడానికి అన్ని ఇండస్ట్రీల నటి నటులు ఆసక్తి చూపిస్తున్నారు.ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలలో ఏదైనా చిన్న పాత్ర అయినా చేయడానికి నటీనటులు ఓకే అంటున్నారు.

అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన ఒక చిత్రంకు టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు నో చెప్పారట..ఆ చిత్రం ఏంటంటే..తన ఆలోచనలకూ రూపమిస్తూ విజువల్ స్టోరీ టెల్లర్ గా పేరొందిన రాజమౌళి వెండితెర మీద ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు.ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలను థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే అనేట్టుగా ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అప్పటి వరకు టాలీవుడ్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను రాజమౌళి బాహుబలి చిత్రం పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సంగతి అందరికి తెలిసిందే.ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన పన్నెడు చిత్రాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచాయి.

Pawan Kalyan S. S. Rajamouli

ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలలో కలెక్షన్స్ పరంగా కొంత తక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా సై చిత్రం ఉందని చెప్పచ్చు.అయితే సై చిత్రానికి కూడా మొదటగా రాజమౌళి ఒక స్టార్ హీరోను అనుకున్నారట.ఈ చిత్రం కోసం ముందు గా రాజమౌళి పవన్ కళ్యాణ్ ను అనుకున్నారట.స్టోరీ విన్నాక డిఫరెంట్ కథ ఉండటంతో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసారని సమాచారం.ఆ తర్వాత నితిన్ తో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అయితే కలెక్షన్స్ పరంగా రాజమౌళి చిత్రాలలో ఈ చిత్రం కొంచెం తక్కువగా సాధించిందని చెప్పచ్చు.ప్రేక్షకులకు రగ్బి ఆట గురించి ఈ చిత్రంతో పరిచయం చేసారు రాజమౌళి.ఈ చిత్రంలో హీరో నితిన్ కు జోడిగా జెనీలియా నటించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here