అంత ఇబ్బంది పడుతూ ఆ డ్రెస్ వేసుకోవడం అవసరమా అంటూ రష్మిక పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు…

నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే వరుస విజయాలను సొంతం చేసుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు రష్మిక.నాగ సౌర్య కు జోడిగా ఛలో చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ అమ్మడు.ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రంతో రష్మిక ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది.గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందాన కూడా ఒకరు.రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి.ఇటీవలే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.ఈ పార్టీ లో బీ టౌన్,సౌత్ సెలెబ్రెటీలు చాల మంది పాల్గొన్నారు.సౌత్ నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా,పూజ హెగ్డే,రష్మిక ఇంకా పలువురు మెరిశారు.ఇక రష్మిక ఈ పార్టీ లో బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.నెట్టింట్లో ఆమె డ్రెస్ పై ట్రోలింగ్ జరుగుతుంది.

ఆ డ్రెస్ లో రష్మిక చాల ఇబ్బంది పడుతూ కనిపించడం ఇందుకు కారణం అని చెప్పచ్చు.పదే పదే డ్రెస్ ను అడ్ జస్ట్ చేసుకుంటూ నడవడానికి ఇబ్బంది పడుతుండడంతో రష్మిక పై ట్రోలింగ్ చేస్తున్నారు.రష్మిక అగచాట్లు పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అంట ఇబ్బంది పడుతూ ఆ డ్రెస్ వేసుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.గ్లామర్ గా కనిపించడానికి చాల రకాల డ్రెస్లు,కాస్ట్యూమ్ లు ఉంటాయి కానీ ఇబ్బంది పడుతూ అదే డ్రెస్ వేసుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అటెన్షన్ కోసమే రష్మిక మందాన ఆ డ్రెస్ వేసుకుంది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *