సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాల మంది స్టార్ లుగా ఎదిగారు.అలా స్టార్ లుగా ఎదిగిన వాళ్లలో చాల మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.ఇలా షార్ట్ ఫిలిమ్స్ తో తమ కెరీర్ మొదలుపెట్టి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు ఎవరంటే…
కిరణ్ అబ్బవరం:కిరణ్ రాజా వారు రాణి వారు అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఎస్ ఆర్ కల్యాణమండపం అనే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.అయితే కిరణ్ గతంలో షార్ట్ ఫిలిమ్స్ లలో నటించడం జరిగింది.

చాందిని చౌదరి:గతంలో చాందిని చౌదరి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం జరిగింది.ఆమె మధురం అనే షార్ట్ ఫిలిం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.చాందిని బ్రమోత్సవం,మను,కలర్ ఫోటో అనే సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

విజయ్ సేతుపతి:డబ్బింగ్ సినిమాల నుంచి తెలుగు పాపులారిటీ ని సంపాదించుకున్న హీరోలలో విజయ్ సేతుపతి కూడా ఒకరు.విజయ్ సేతుపతి ఉప్పెన,సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల ద్వారా డైరెక్ట్ గా తెలుగులో కూడా నటించారు.విజయ్ సేతుపతి కెరీర్ స్టార్ట్ అయినా కొత్తలో షార్ట్ ఫిలిమ్స్ లో అలాగే టీవీ సీరియల్ లో కూడా నటించడం జరిగింది.

పూజిత పొన్నాడ:అను తను నేను,పరిచయం,దీపికా పదుకొనే వంటి పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఆ తర్వాత కల్కి,బ్రాండ్ బాబు వంటి పలు సినిమాలలో కూడా ఈమె నటించడం జరిగింది.

సుహాస్:ప్రతి రోజు పండగే,మజిలీ వంటి సినిమాలలో ముఖ్య పాత్రలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సుహాస్.ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు.సుహాస్ గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లలో నటించడం జరిగింది.

రీతూ వర్మ:అనుకోకుండా అనే షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపును తెచ్చుకున్న రీతూ వర్మ ఆ తర్వాత తెలుగులో పెళ్లి చూపులు,కేశవ,వరుడు కావలెను వంటి చిత్రాలలో నటించింది.

విశ్వక్ సేన్:పిట్టకథ అనే షార్ట్ ఫిలిం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది,ఫలక్ నామ దాస్,హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నవీన్ పోలిశెట్టి:ఈయన AIB లో ఎన్నో వీడియోస్ లో నటించడం జరిగింది.ఇంజినీరింగ్ గురించి చేసినా ఒక వీడియొ ద్వారా నేషనల్ వైడ్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.

రాజ్ తరుణ్:రాజ్ తరుణ్ కెరీర్ స్టార్టింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు.ఆ తర్వాత తెలుగులో ఉయ్యాలా జంపాల అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ప్రియాంక జవల్కర్:పోసిసివ్ నెస్,ఇట్స్ ఏ గర్ల్ అనే షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఆ తర్వాత టాక్సీ వాళ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

వైష్ణవి చైతన్య:వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి బేబీ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

విజయ్ దేవరకొండ:కొంచెం టచ్ లో ఉంటె చెప్తా అనే షార్ట్ ఫిలిం లో నటించారు.ఆ తర్వాత తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.