Home సినిమా అతని పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న యాంకర్ సుమ…ఆ పేరు ఎవరిదో తెలుసా…

అతని పేరును చేతిపై పచ్చబొట్టు వేయించుకున్న యాంకర్ సుమ…ఆ పేరు ఎవరిదో తెలుసా…

1
0

బుల్లితెర మీద తన వాక్చాతుర్యంతో,యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకునే సీనియర్ యాంకర్ సుమ కనకాల.పాపులర్ యాంకర్ అయినా సుమ కనకాల ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తన చేతిపై ఉన్న పచ్చబొట్టు వెనుక ఉన్న రహస్యాన్ని తెలిపారు.సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి మాట్లాడారు.అయితే యాంకర్ సుమ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాటికి నేటికీ యాంకరింగ్ లో తనకు ఎవరు సాటిలేరు అని సుమ నిరూపించుకుంటూనే ఉన్నారు.తన యాంకరింగ్ తో అభిమానులను ఆకట్టుకోవడంలో సుమ స్టైల్ లే వేరు అని చెప్పచ్చు.

తన యాంకరింగ్ తో బుల్లితెర మీద ప్రోగ్రామ్స్ తో పాటు సినిమా ఈవెంట్స్ కూడా చాల సక్సెస్ ఫుల్ చేస్తారు సుమ.అయితే సుమ ప్రధాన పాత్రలో నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ఇప్పటికే షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు యాంకర్ సుమ ఎక్కువగా ఇంటర్వ్యూలలో మరియు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుంది.తన చేతిపై వెంకన్న అని ఉన్న పచ్చబొట్టుపై తాజాగా సుమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.ఆ పచ్చబొట్టు వెనుక ఉన్న రహస్యం తెలియాలంటే జయమ్మ పంచాయతీ సినిమా తప్పకుండ చూడాల్సిందే అని చెప్పుకొచ్చింది సుమ.

సినిమా సెకండ్ హాఫ్ లో చేతిపై ఉన్న పచ్చ బొట్టు వెనుక రహస్యం తెలుస్తుంది అని సుమ తెలిపారు.ఇక ఈ సినిమా కు సంబంధించి టీజర్ ను హీరో నాని తో మరియు ట్రైలర్ ను మహేష్ బాబు తో రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే.ఇక ఈ చిత్రం మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి కలివరపు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సుమ తో పాటు పలువురు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా,బలగ ప్రకాష్ వెన్నెల కిషోర్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Previous articleవిల్లు ఎక్కుపెట్టి…క్రికెట్ ఆడి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న మంత్రి రోజా…
Next articleపూర్తిగా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్న కాజల్…అసలు ఏమైదంటే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here