కొంత మంది నటి నటులు చేసింది ఒకటో రెండో సినిమాలే అయినా కూడా వాళ్ళు ప్రేక్షకులను ఎప్పటికి గుర్తుండి పోతారు.అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సెకండ్ హీరోయిన్ అని కూడా ఒకరు అని చెప్పచ్చు.సుందరకాండ సినిమాలో వెంకటేష్ లెక్టరర్ గా నటించారు.ఈ చిత్రంలో లెక్టరర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ నటించడం జరిగింది.ఇక ఈ పాత్ర కోసం రాఘవేంద్ర రావు స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు.కానీ కొత్త అమ్మాయి అయితే ఈ పాత్రకు సూట్ అవుతుంది అని భావించి అపర్ణను తీసుకున్నారు.ఒక రోజు రాఘవేంద్ర రావు గారు నిర్మాత కె వి వి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక అమ్మాయి బాగా నచ్చింది.
ఆ అమ్మాయి అయితే తన సినిమాలోని పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని భావించి రాఘవేంద్ర రావు గారు ఆ అమ్మాయినే ఫైనల్ చేయాలనీ అనుకున్నారు.నిర్మాత ఇంట్లో ఆ అమ్మాయిని చూసినప్పుడు అసలు ఆ అమ్మాయి ఎవరు..సినిమాలు చేస్తుందో..లేదో అని భావించి రాఘవేంద్ర రావు గారు అప్పుడు ఆ అమ్మాయిని అడగలేకపోయారట.కానీ 10 రోజుల తర్వాత సినిమా కోసం జరిగిన ఆడిషన్స్ లో ఆ అమ్మాయి కూడా రావడం జరిగింది.కె వి వి సత్యనారాయణ గారి మేనకోడలు సర్ పేరు అపర్ణ అని అసిస్టెంట్ చెప్పడం జరిగింది.

అప్పుడు వెంటనే రాఘవేంద్ర రావు గారు ఆమెను ఓకే చేసేయండి అని అన్నారు.అపర్ణ కు నటన వచ్చా..రాదా..అంటూ అందరు చాల టెన్షన్ పడ్డారు.కానీ ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది.ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు క్యూ కట్టాయి కానీ ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.అయితే అపర్ణ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాలో నటించడం జరిగింది.
ఆ తర్వాత అపర్ణ 2002 లో వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయింది.ప్రస్తుతం అపర్ణ సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే 1992 లో వచ్చిన రీమేక్ చిత్రం సుందరకాండ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.నిజానికి లెక్టరర్ పాత్ర తనకు సూట్ అవ్వదని వెంకటేష్ కు అప్పట్లో చాల మంది చెప్పారట.కానీ రాఘవేంద్ర రావు గారి మీద నమ్మకంతో సుందరకాండ సినిమాలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.
