సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తేనే మనసులు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.జేమ్స్ బాండ్,కౌబాయ్ వంటి హీరోల పాత్రలను తెలుగు సినిమా ప్రేక్షకులకు అప్పట్లోనే పరిచయం చేసారు.అయితే గత కొంత కాలంగా కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ నెల మే 31 న కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కూతురు మంజుల కృష్ణ గారి ఇంటర్వ్యూ చేసి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వనున్నారు.దీనికి సంబంధించి ప్రోమో ను తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసాడు మంజుల.
దీనికి సంబంధించిన ఫుల్ వీడియోను మే 31 న విడుదల చేయనున్నారని తెలుస్తుంది.ఇప్పటికే విడుదల అయినా వీడియోలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.మంజుల కృష గారి స్కిన్ గురించి అడిగినప్పుడు…దేవుడి దయ వలన ఇంకా మెరుస్తూనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తాను పని లేకుండా బయటకు వెళ్లట్లేదు అని…విశ్రాంతి తీసుకుంటున్నాను అని కృష్ణ తెలిపారు.నాన్న కాన్స్టిట్యూషన్ వచ్చిందని మహేష్ తనను చూసి కుల్లుకుంటాడని మంజుల సరదాగా చెప్పుకొచ్చారు.
హీరో అవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది అని అడిగినప్పుడు..ఏ ఉద్యోగం చేయను..హీరో అవ్వడానికి ఏ ఉద్యోగం చేయలేదు అని కృష్ణ గారు తెలిపారు.ఆనాటి విషయాలను గుర్తుచేసుకుంటూ గూఢచారి 116 లో నిన్ను హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నాము..వెయ్యి రూపాయలు తీసుకోని కాంట్రాక్టు మీద సంతకం పెట్టు అని అడిగారని చెప్పుకొచ్చారు.మహేష్ తన చిన్నతనంలో షూటింగ్ జరుగుతుండగా స్టూడియో కి వచ్చి దూరం నుంచి కూర్చొని చూసేవాడు అని తెలిపారు.ఆ సమయంలో నేను వెళ్లి నువ్వు కూడా ఆక్ట్ చేస్తా అని అడిగినప్పుడు నేను చేయను చేయను అంటూ స్టూడియో మొత్తం పరిగెత్తించేవాడు అని కృష్ణ అప్పటి విషయాలను పంచుకున్నారు.