సురేఖ వాణికి త్వరలోనే పెళ్లి అంటూ క్లారిటీ ఇచ్చిన కూతురు సుప్రీతా…

టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేస్తూ నటి సురేఖ వాణి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు.సినిమాలతోనే కాకుండా సురేఖ వాణి సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు చేరువలో ఉంటారు.ఎల్లప్పుడూ తనకు సంబంధిచిన ఫోటోలను,వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటారు.సురేఖ వాణి కూతురు సుప్రీతా కు కూడా సోషల్ మీడియాలో బాగా క్రేజ్ ఉంది.ఈమె మంచు లక్ష్మి తో కలిసి లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటిస్తున్నారు.ఇక ఇటీవలే సుప్రీతా పుట్టిన రోజు కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిన సంగతి అందరికి తెలిసిందే.

తాజాగా యూట్యూబర్ అయినా నిఖిల్ విజయేంద్ర సింహ నటి సురేఖ వాణిని మరియు ఆమె కూతురు సుప్రీతా ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది.ఈ ఇంటర్వ్యూ లో నిఖిల్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సురేఖ మరియు సుప్రీతా చాల సరదాగా సమాధానం చెప్పడం జరిగింది.కొన్ని సీరియస్ ప్రశ్నలకు కూడా యూట్యూబర్ నిఖిల్ తనదైన శైలిలో సమాధానాలు రాబట్టాడు.ఇప్పుడు ఇతను అడిగిన ఒక ప్రశ్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.నిఖిల్ త్వరలో సురేఖ వాణి మల్లి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించగా…సురేఖ నో అనే బోర్డు చూపించారు.కానీ కూతురు సుప్రీతా మాత్రం ఎస్ అనే బోర్డు చూపించడం జరిగింది.

దాంతో పాటు సుప్రీతా చేసేద్దాం సింగల్ గా ఎలా ఉంటుంది…అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్ చేసారు.సురేఖ వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చారు.బాయ్ ఫ్రెండ్ విషయంలో కూడా నిఖిల్ ప్రశ్నించడం జరిగింది.నిఖిల్ మీరిద్దరూ సింగిలే నా అంటూ ప్రశ్నించగా..ఇద్దరు అవునని సమాధానం చెప్పారు.మీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని అడగగా…నన్ను భరిస్తే చాలు అంటూ సుప్రీతా సమాధానం ఇచ్చారు.

సురేఖ మాత్రం 6 ఫీట్ హైట్ ఉండాలి,మంచి కలర్,బాగా డబ్బు ఉండాలి,బాగా చూసుకోవాలి,లైట్ గ గడ్డం కూడా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు.అందుకు మరి ఇవన్నీ మీకు లేవుగా సార్ అంటూ సుప్రీతా కెమెరా చూస్తూ కామెంట్ చేయడం జరిగింది.దాంతో సురేఖ వానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా..లేదా ఎవరైనా వన్ సైడ్ ట్రై చేసుతున్నారా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.నిఖిల్ కూడా ఎవరైనా ఉన్నారా అంటూ అడగగా సురేఖ లేరంటూ సమాధానం చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *