ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు,మధుర జ్ఞాపకాలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా సౌత్ హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి.ఈ చిన్ననాటి ఫోటోలలో ఉన్న తమ ఇష్టమైన స్టార్స్ ను గుర్తుపట్టడానికి అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం ఒక టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.
దివంగత మాజీ రాష్ట్రపతి,దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయినా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఒక స్కూల్ చిన్నారి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఢిల్లీ లో పుట్టిన ఈమె ఢిల్లీ లోని కాలేజీ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది.ఆ టైం లో సినిమాల ఆసక్తితో యాక్టింగ్ స్కూల్ లో చేరడం జరిగింది.

అక్కడ యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ్ లో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వేరమథిరి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతో తన అందంతో అభినయంతో సక్సెస్ అయినా ఈమె ఆ తర్వాత ధనుష్ నటించిన విఐపి సినిమాలో నటించింది.హీరో సందీప్ కిషన్ తో తెలుగులో బీరువా అనే సినిమాలో నటించింది ఈ అమ్మడు.

సురభి టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో ఎక్ష్ప్రెస్స్ రాజా,జెంటిల్ మ్యాన్,ఒక్క క్షణం,శశి సినిమాలలో నటించింది.ఇక అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటుంది.కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను,వీడియోలను ఎప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
