Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి,కూతురు,భార్య ఇలా ఏ పాత్ర అయినా కూడా సులభం గా చేసే నటి సురేఖ వాని గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సురేఖావాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ముఖ్యం గా ఈమె బ్రమ్మానందం వంటి కమెడియన్ పక్కన నటించి అలరించింది.సోషల్ మీడియాలో చాల ఆక్టివ్ గా ఉండే సురేఖావాణి తన కూతురు సుప్రీతా తో కలిసి డాన్స్ వీడియోలు చేసి అవి నెట్టింట్లో షేర్ చేసేది.సురేఖ తో పాటు ఆమె కూతురు సుప్రీతా కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ఆక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన డాన్స్ వీడియొ లు,లేటెస్ట్ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటారు.నాలుగుపదుల వయస్సులో కూడా సురేఖ వాని తన కూతురు సుప్రీతా కు పోటీగా డాన్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.
తల్లి కూతుర్లకు సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉంది.వీరిద్దరూ తమ డాన్స్ వీడియోలతో ఎప్పుడు అదరగొడుతూ ఉంటారు.తాజాగా ఈమె తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియొ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.సురేఖ వాని తన కూతురు సుప్రీతా తో కలిసి అమెరికా లో అట్లాంటిక్ సిటీ లో సందడి చేస్తున్నారు.ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సురేఖ వాణి ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది.వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి సురేఖ వాణి ని ఆరు లక్షలు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.యు ట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తున్నారు నటి సురేఖ వాని.
ఈ ఛానల్ లో ఆమె తన కూతురు సుప్రీతా తో కలిసి చేసిన డాన్స్ వీడియొ లను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సోషల్ మీడియా ద్వారా కూడా అలరిస్తున్నారు సురేఖ వాణి.సహాయ నటిగా సురేఖ వాని చాల సినిమాలలో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా ఆమె నటిస్తూనే ఉన్నారు.బ్రమ్మానందం వంటి కమెడియన్ పక్కన నటించి ఈమె మంచి క్రేజ్ ను తెచ్చుకున్నారు.సురేఖ వాని పారితోషకం గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈమె ఒక్కో సినిమాకు ఎనిమిది నుంచి పది లక్షలు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం.అయితే పారితోషకం పాత్రను బట్టి పాత్ర నిడివిని బట్టి మారుతుందని సమాచారం.కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా ఈమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అందంతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.
View this post on Instagram