సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో మరియు స్టార్ హీరోయిన్లను చాల మంది ఫాలో అవుతూ ఉంటారు.అభిమానులు తమకు నచ్చిన నటి నటుల డ్రెస్సింగ్,లైఫ్ స్టైల్ ఒకటేమిటి అన్నింటిని అనుసరించాలి అని అనుకుంటారు.ఇప్పటి వరకు చాల మంది నటి నటుల చిన్ననాటి సింగల్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.ఇప్పుడు తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి దిగిన చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలను గుర్తుపట్టడానికి అభిమానులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.శరవణన్ శివకుమార్ అంటే చాల మందికి తెలియక పోవచ్చు కానీ సూర్య అంటే మాత్రం బాగా గుర్తుపడతారు.
ఇటీవలే విడుదల అయినా విక్రమ్ సినిమాలో రోలెక్స్ గా అదిరిపోయే యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇరవై అయిదు ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.ఈ సందర్భంగా కార్తీ తన అన్న గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.తన ప్రతి మైనస్ ని ప్లస్ గా మార్చుకోవడానికి రాత్రిపవళ్ళు కష్టపడ్డాడు…,తన సొంత విజయాలను అధిగమించడంపై మాత్రమే దృష్టి పెట్టాడు…,ఒక వ్యక్తి గా వెలది మంది పిల్లలను తీర్చిదిద్దాడు…అతడే నా అన్నయ్య అంటూ పోస్ట్ చేసారు కార్తీ.

ఇక తమిళ్ నటుడు శివకుమార్ వారసుడిగా సూర్య సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.నేరుక్కు నేర్ అనే సినిమాతో పరిచయమయ్యారు సూర్య.కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదురుకొన్న సూర్య ఆ తర్వాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.తమిళ్ తో పాటు తెలుగులో కూడా క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.విక్రమ్ లో రోలెక్స్ అనే వైలన్ట్ విలన్ గా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.