కొన్ని కొన్ని సార్లు మనం తలచిన కొన్ని విషయాలు కలల రూపంలో వస్తుంటాయి.మరికొన్ని సందర్భాల్లో మన ఆలోచనలకూ సంబంధం లేని విషయాలు కూడా మన కలలో కనిపిస్తుంటాయి.అయితే కొంత మంది కలలు నిజమవుతాయి అని నమ్ముతారు.మరో పక్క మరికొంత మంది వాటిని కొట్టి పడేస్తుంటారు.ఇక కలలో కొన్ని వస్తువులు కనిపించకూడదని,కొన్ని రకాల కలలు రాకూడదని చాల మంది నమ్ముతుంటారు.కలల శాస్త్రం ప్రకారం కొన్ని కాలాలకు అర్ధం ఉంటుంది అని చాల మంది విశ్వసిస్తారు.కొన్ని కలలు నిజజీవితంలో ప్రభావం చూపుతాయని కలల శాస్త్రం లో చెప్పబడింది.అయితే కొన్ని రకాల వస్తువులు కలలో కనిపిస్తే వాటికి ప్రత్యేక అర్ధం ఉందని కలల శాస్త్రంలో పేర్కొనబడింది.
అయితే కలలో విమానం కనిపిస్తే మంచి జరుగుతుందా..లేదా చేదు జరుగుతుందా అనేది చాల మందికి తెలియదు.అయితే కలల శాస్త్రం ప్రకారం మీ కలలో విమానంలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే మీ కలలు త్వరలోనే నెరవేరుతాయని అర్ధమట.ఇది మీరు చేసే పనిలో గొప్ప విజయాన్ని సూచిస్తుంది.దీనిని చాల పవిత్రమైన కలగా భావించడం జరుగుతుంది.అదే మీ కలలో రన్ వే పై ఉన్న విమానం కనుక కనిపిస్తే మీరు చాల కాలంగా అనుకుంటున్న పని త్వరలోనే పూర్తి అవుతుందని అర్ధం.
విమానం టేక్ ఆఫ్ అవుతున్నట్లు కనుక కల వస్తే అది మంచి సంకేతం అట.ఈ కల భవిష్యత్తు విజయాన్ని సూచిస్తుంది.అదే కలలో కనుక చాల విమానాలు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు అవుతారని,ఆర్ధికంగా బలపడతారు అని అర్ధం.అదే కలలో విమానం కూలిపోవటం,విమానం ప్రమాదం వంటి కల వస్తే అది అశుభకరమైన కల అని నిపుణులు చెప్తున్నారు.మీరు శ్రమతో చేస్తున్న పనికి ఆటంకం కలుగుతుందని అర్ధం.అదే కలలో భారీ విమానం కనిపిస్తే అది అఖండ విజయానికి సంకేతం.మీరు కోరుకున్న వాటిలో కొన్ని అనుకోకుండా నెరవేరుతాయని అర్ధం.