Allu Arjun: 69 ఏళ్ళ జాతీయ చలన చిత్ర అవార్డులు మొదటి సరిగా ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు సందడి చేసుకుంటున్నారు.అయితే రెండు చేతులు లేని ఒక దివ్యంగురాలు అల్లు అర్జున్ కు వినూత్నంగా విషెస్ తెలియ చేయడం అందరి మనసును కదిలిస్తుంది.ఆమె నోటితో అల్లు అర్జున్ చిత్రపటం గీసి బన్నీ కి అభినందనలు తెలియజేసింది.తన నోటితో పుష్ప మూవీ లోని అల్లు అర్జున్ గెటప్ ను చిత్రపటం గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.దివ్యంగురాలి స్ఫూర్తికి అల్లు అర్జున్ అభిమానులు,నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పుష్ప సినిమాలోని అద్భుతమైన నటనకు జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.దాంతో ఐకాన్ స్టార్ కు మెగాస్టార్ చిరంజీవి నుంచి సామాన్యుల వరకు విషెస్ తెలుపుతున్నారు.ఇక సోషల్ మీడియా ఖాతాలలో అయితే అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది అని చెప్పచ్చు.69 ఏళ్ళ జాతీయ చలన చిత్ర అవార్డు తోలి సారి ఒక తెలుగు నటుడికి రావడం చాల గర్వంగా ఉంది అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక దివ్యంగురాలు బన్నీ కి వినూత్నంగా విషెస్ తెలియజేసింది.రెండు చేతులు లేని ఆమె తన నోటితో బన్నీ చిత్రపటాన్ని గీసి బన్నీ కి విషెస్ తెలియజేసింది.శ్రీకాకుళం కు చెందిన కొవ్వాడ స్వప్నికా ఒక ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయింది.ప్రమాదం జరిగిన కూడా ఈమె కుంగిపోకుండా తన కళలు నెరవేర్చుకోవడానికి నోటితో బొమ్మలు గీయడం నేర్చుకుంది.
తెలుగు సినీ ప్రముఖుల చిత్ర పాటలు నోటితో గీసి మౌత్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది స్వప్నికా.మెగా అభిమాని అయినా స్వప్నికా చిరంజీవి,పవన్ కళ్యాణ్ ను అమితంగా అభిమానిస్తూ ఉంటుంది.గతంలో స్వప్నికా చిరంజీవి,పవన్ కళ్యాణ్ చిత్ర పటాలను అద్భుతంగా గీయడం జరిగింది.పవన్ కళ్యాణ్ స్వప్నికా టాలెంట్ కు ఫిదా అయ్యి ఒకసారి నేరుగా కలిసి అభినందనలు తెలియజేసారు.ఈమెలో మరో టాలెంట్ కూడా ఉంది.మెగా హీరోల పాటలకు ఈమె అద్భుతంగా డాన్స్ కూడా చేయగలదు.
#Congratulations @alluarjun annayya#Pushpa
Thaggede le pic.twitter.com/WJnQy0CAI6— @mouth Artist Swapnika (@PawanSister) August 26, 2023