Taapsee: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా అభిమానులకు చేరుకుంటుంది.సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు,వీడియోలు దగ్గర నుంచి లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ వరకు అన్ని కూడా క్షణాలలో అభిమానులకు తెలిసిపోతుంది.అలాగే స్టార్లు కూడా సోషల్ మీడియా ప్లేట్ ఫామ్ ద్వారా తమకు సంబంధించిన అన్ని విషయాలను తమ చిన్ననాటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటి వరకు చాల మంది నటి నటుల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఫ్యాన్స్ కూడా తమ ఇష్టమైన హీరో హీరోయిన్ లు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అని చూడడానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు.ప్రస్తుతం చిన్ననాటి ఫొటోలో ఎంతో ముద్దుగా ఉన్న ఒక స్టార్ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టడానికి ఫ్యాన్స్ కూడా బాగానే తమ మెదడుకు పని పెడుతున్నారు.

చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా ఉన్న హీరోయిన్ ఎవరో కాదు ఝమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయినా తాప్సి.ఫస్ట్ సినిమాతోనే ఈమె తన అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పచ్చు.ఆ తర్వాత ఈమె తెలుగుతో పాటు తమిళ్,హిందీ లో కూడా సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం తాప్సి చిన్ననాటి క్యూట్ ఫోటో నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటుంది.