ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా…

సినిమా ఇండస్ట్రీలో మొదట దర్శకులు కథను ఒక హీరోను ఉహించుకొని రాయడం తర్వాత ఆ కథ వేరే హీరో దగ్గరకు వెళ్లడం వంటివి జరుగుతుంటాయి.కథ నచ్చకపోవటం,డేట్స్ ఎడ్జస్ట్ చేసులేకపోవటం వంటివి కూడా కారణాలు కావచ్చు.ఇలా కొంత మంది హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.ఇలా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అయినా సినిమాలలో ఠాగూర్ సినిమా కూడా ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు.చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయినా చిత్రాలలో ఠాగూర్ సినిమా కూడా ఒకటి.

ఠాగూర్ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయినా రమణ అనే చిత్రంకు రీమేక్.వి వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రియ హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ కూడా బాగా హైలైట్ అని చెప్పచ్చు.అవినీతి,లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కబడిన ఈ చిత్రం ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ చిత్రంలో చిరంజీవి చెప్పిన ప్రతి డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి.ఇక ఠాగూర్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే మొదట ఈ సినిమా హీరో రాజశేఖర్ వద్దకు వెళ్లిందట.కానీ అదే టైములో పలు సినిమాలతో బిజీగా ఉన్న రాజశేఖర్ ఈ చిత్రాన్ని వదులుకోవడం జరిగింది.దాంతో వి వి వినాయక్ చిరంజీవి గారితో అదే చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.అప్పట్లో రాజశేఖర్ ఏ సినిమా కోసం ఠాగూర్ చిత్రాన్ని వదులుకున్నారో అది కాస్త అట్టర్ ప్లాప్ అవ్వడం జరిగింది.ఠాగూర్ సినిమా చేసి ఉంటె మాత్రం రాజశేఖర్ కెరీర్ మరోలా ఉండేది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *