Takkari Donga: జయంత్ పరాంజీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా టక్కరి దొంగ.మహేష్ బాబు కౌ బాయ్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా మహేష్ అభిమానులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో హిందీలో,తమిళ్ లో కూడా రిలీజ్ అయ్యింది.ప్రయోగాత్మక సినిమాలతో కూడా మహేష్ బాబు( Mahesh Babu ) ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.ఇప్పటి వరకు మహేష్ బాబు తన కెరీర్ లో నటించిన డిఫరెంట్ సినిమాలలో టక్కరిదొంగ సినిమా కూడా ఒకటి.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్లు బిపాసాబసు( Bipasha Basu ),లిసా( Lisa Ray ) రే హీరోయిన్ లుగా నటించారు.బిపాసాబసు హిందీ లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకుంది.ఇక లిసా రే కూడా హిందీ లో పలు సినిమాలలో నటించి మెప్పించింది.లిసా రే తెలుగు లో టక్కరి దొంగ సినిమాలో మాత్రమే కనిపించింది.ఈమె కనిపించింది ఈ ఒక్క సినిమాలోనే అయినప్పటికీ తన అందంతో నటనతో అందరిని కట్టిపడేసింది.
ఈమె కెనడియన్ నటి.ఈమె హిందీ,తమిళ్,కన్నడ లో కూడా నటించింది.పలు హిందీ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ఈమె కనిపించింది.ప్రస్తుతం లిసా రే టీవీ షోస్,వెబ్ సిరీస్ తో బిజీ గా ఉంది.తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈమె ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
View this post on Instagram