సంగీత దర్శకుడు తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆయన ఇటీవలే సంగీతం అందించిన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట చిత్రం హిట్ టాక్ తో థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.ఈ చిత్రం విజయంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తమన్.ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమన్ తన పర్సనల్ విషయాలను కూడా పంచుకున్నారు.చాల కాలం క్రితమే ఆయనకు పెళ్లి అయినా సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో అలరిస్తున్న యువ దర్శకులలో తమన్ కూడా ఒకరు.ఇటీవలే ఆయన సంగీతం అందించిన అఖండ,రాధే శ్యామ్,భీమ్లా నాయక్,వకీల్ సాబ్,సర్కారు వారి పాట ప్రేక్షకులను బాగా అలరించాయి.
తమన్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ 107 వ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.తమన్ ప్లే బ్యాక్ సింగర్ అయినా వర్దిని ని పెళ్లి చేసుకున్నారు.వర్దిని గతంలో పలువురు సంగీత దర్శకుల దగ్గర ప్లే బ్యాక్ సింగర్ గా పాటలు పాడారు.తమన్ సంగీత దర్శకత్వంలో కూడా ఆమె పాటలు పడటం జరిగింది.కానీ ఆమె పెద్దగా పాపులర్ కాలేదు.ఇటీవలే తమన్ సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన భార్య వర్దిని గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తన భార్య వాయిస్ చాల బాగుంటుందని,నిర్మాత దర్శకులు అడిగితె ఆమెతో పాటలు పాడిస్తాను అని చెప్పుకొచ్చారు.తన భార్య తో స్టేజ్ షోలు చేయాలి అనేది తన డ్రీం అని చెప్పుకొచ్చారు తమన్.తన కొడుకు గురించి మాట్లాడుతూ..ముందుగా తన కొడుకే వింటాడని..తనకు మ్యూజిక్ సెన్స్ బాగా ఉందని తెలిపారు.ఇక తమన్ సంగీతం అందించిన కళావతి సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ సరికొత్త రికార్డు లను క్రియేట్ చేస్తుంది.తమన్ స్వరపరిచిన ఈ సాంగ్ ఇప్పటికే వంద మిల్లియన్స్ పైగా వ్యూస్ అందుకుంది.