March 26, 2023

సిల్వర్ కలర్ డ్రెస్ లో మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో మెరిసిపోతున్న తమన్నా….లేటెస్ట్ ఫోటోలు వైరల్….

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సినిమాలలో హీరోయిన్ల అందాలకు అందరు ఫిదా అవుతుంటారు.అయితే కొందరు హీరోయిన్లను మాత్రం మేక్ అప్ లేకుండా చూడలేము.కానీ మేక్ అప్ లేకపోయినా పాల మీగడ అందాలతో మిల్కీ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా.తమన్నా అందం గురించి నటన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమన్నా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అయ్యింది.ఇప్పటి వరకు తమన్నా తన కెరీర్ లో తెలుగుతో పాటు తమిళ్,హిందీ,కన్నడ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది.తమన్నా తన కెరీర్ లో 50 కు పైగా సినిమాలలో నటించడం జరిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమన్నా ఫ్యాషన్ ఐకాన్.

తమన్నా డిఫరెంట్ డ్రెస్సుల్లో ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటుంది.ట్రెండీ లుక్ తో ఎప్పటికప్పుడు అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది మిల్కీ బ్యూటీ.తాజాగా సిల్వర్ డ్రెస్ లో కళ్ళు చెదిరే అందాలతో తళుక్కున మెరిసింది తమన్నా.ఇషాన్ గిరి అనే ఫోటోగ్రాఫర్ చేసిన ఫోటో షూట్ లో తమన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో ఎప్పుడు కనిపించని లుక్ లో కనిపించి తమన్నా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఆ ఫోటో షూట్ తమన్నా అల్ట్రా స్టైలిష్ గా ఉంది.

ఒక్కప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో బిజీ గా ఉన్న తమన్నా ఆ తర్వాత కొంత స్లో అయినా కూడా మల్లి ఇప్పుడు పిక్ అప్ అయ్యిందని చెప్పచ్చు.బాడీ ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తూ ఇటు స్మాల్ స్క్రీన్ తో పాటు సినిమాలలో కూడా అలరిస్తుంది తమన్నా.తెలుగులో దాదాపుగా అందరు స్టార్ హీరోలకు జోడిగా నటించింది తమన్నా.శ్రీ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనా తమన్నా ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మిల్కీ బ్యూటీ.రచ్చ సినిమా లో తమన్నా అందం కు అందరు ఫిదా అవ్వాల్సిందే.తమన్నా అందం గురించి నటన గురించి యెంత చెప్పిన తక్కువే అవుతుంది.తెలుగులో సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు హిందీ లో కూడా అవకాశాలతో బిజీ గా ఉంది ఈ అమ్మడు.

తమన్నా ప్రస్తుతం f 3 సినిమాతో పాటు గుర్తుందా శీతాకాలం,మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలలో నటిస్తుంది.ఇక వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది.రంగం,అల్లుడు శ్రీను,జైలవకుశ వంటి పలు సినిమాలలో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *