డ్యాన్స్ లో హీరోల విషయానికి వస్తే చిరంజీవి నుంచి అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరకు అందరి పేర్లు టక.. టకా.. చెప్పచ్చు. కానీ హీరోయిన్ల విషయానికి వస్తే కాస్త తడబడాలి. హీరోలతో పాటు పోటీ పడి డ్యాన్స్ చేసే వారు కూడా ఉన్నారు. కానీ వారు సైతం తక్కువ సినిమాల్లో కినిపించి, ఎక్కువ పాపులర్ కాలేకపోయారు. దీనికి తోడు హీరోలతో డ్యాన్స్ చేయాలంటే హీరోయిన్లు కూడా మంచి డ్యాన్సర్లు అయి ఉండాలి మరి. ఆ వరుసలో ముందుంటుంటి తమన్నా భాటియా. ఆమె డ్యాన్స్ కు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అటువైపు ఓ లుక్కేద్దాం మరి.
వెండితెరపై అందాలను ఆరబోస్తూ మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకుంది తమన్న భాటియా. మంచు వారసుడు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ‘హ్యపీడేస్’తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించేందుకు ఈ అమ్మడికి చాలానే టైం పట్టిందని చెప్పాలి. ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ‘100%’తో తమన్నా సినీ కెరీర్ ఒక మలుపు తిరిగింది. రీసెంట్ గా రిలీజైన ‘గని’ మూవీలో ఓ సాంగ్ లో నర్తించిన ఆమె ‘ఎఫ్-3’లో ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ వేదికగా ‘బబ్లీ బౌన్సర్, ప్లాన్-ఏ ప్లాన్-బీ’ తదితర హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించిందీ చిన్నది.

చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ అనే ఒక ఈవెంట్ నిర్వహించారు. దీనికి గెస్ట్ హోదాలో వెళ్లింది తమన్నా. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కు స్టెప్పులేసింది. అందరినీ ఆకట్టుకుంటూ సాగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులతో కలిసి నర్తించింది. ఈ ఫంక్షన్ కు వెళ్లిన ఓ నెటిజన్ వీడియో తీసి ట్విటర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టకుంటుంది. బాగా వైరల్ అయిన ఈ వీడియో మీ కోసం చూడండి మరి..
.@tamannaahspeaks Vibes for #vaathicoming at #Metacreatorday event at Chennai. pic.twitter.com/lPuZn7ON4F
— Abєєѕ (@AbeesVJ) October 27, 2022