Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్య కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గజినీ సినిమాతో సూర్య తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.గజినీ సినిమా హిట్ తర్వాత తెలుగులో సూర్య కు ప్రత్యేక ఇమేజ్ ఫాలోయింగ్ ఏర్పడ్డాయి.అప్పటి నుంచి సూర్య తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తూ వస్తున్నారు.ఇక తాజాగా సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ఈ సినిమా భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుందని సమాచారం.అయితే ప్రస్తుతం సూర్య తన కుటుంబం తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే వీరి ఫ్యామిలీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ గా మారాయి.సూర్య,జ్యోతిక ప్రేమించి పెద్దల సమక్షంలో 2006 లో పెళ్లి చేసుకున్నారు.
ఈ దంపతులకు దియా అనే కూతురు,దేవ్ అనే కుమారుడు ఉన్నాడు.ఇక సూర్య తాజాగా కంగువ అనే భారీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి వస్తున్నారు.ఇటీవలే రిలీజ్ అయినా ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది.ఊహించని విజువల్స్ తో ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా కథ ఇటీవలే తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసారా కథకు దగ్గరగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కథ ప్రెసెంట్ గోవా లో జరుగుతుందట.అయితే లేటెస్ట్ గా విడుదల అయినా టీజర్ లో సన్నివేశాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం సన్నివేశాలట.
ఇక ప్రెసెంట్ టైం తో పాటు గతంలో జరిగిన కొన్ని సన్నివేశాలను లింక్ చేసి చూపిస్తారంట.గతంలో హీరో ఒక క్రూరమైన రాజుల ఉంటాడట.అయితే అతను ప్రస్తుత కాలానికి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా కథ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సూర్య ఇతర సినిమాల విషయానికి వస్తే తమిళ స్టార్ దర్శకుడు బాల దర్శకత్వంలో సూర్య వణంగాన్ అనే సినిమా చేస్తున్నారు.సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరొక కీలక పాత్ర కోసం హీరోయిన్ కృతి శెట్టి ని తీసుకున్నట్లు సమాచారం.అయితే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి.ఈ సినిమా కథ మార్పులు చేర్పులు విషయంలో దర్శకుడికి సూర్య కి భేదాభిప్రాయాలు రావడంతో సూర్య సున్నితంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
View this post on Instagram