విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆయన తన వైవిధ్యమైన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసి అభిమానులను సంపాదించుకున్నారు.చాల సినిమాలలో ఆయన తనకంటే చిన్నవారికి మరియు తనకంటే పెద్దవారికి కూడా తండ్రి పాత్రలు చేయడం జరిగింది.తన సహజమైన నటనతో తన కంటే వయస్సులో పెద్దవారికి కూడా తండ్రి పాత్రలో నటించి ఆ పాత్రకే జీవం పోశారు ప్రకాష్ రాజ్.అంతపురం అనే చిత్రంలో సాయికుమార్ కు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటించిన సంగతి అందరికి తెలిసిందే.
ప్రకాష్ రాజ్ వయస్సు సాయికుమార్ కంటే తక్కువే అయినా కూడా అంతపురం చిత్రం లో సాయికుమార్ కు తండ్రిగా అద్భుతంగా నటించారు.అంతపురం చిత్రం ఘనవిజయం సాధించటంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలో కూడా తనకంటే వయస్సులో పెద్దవాడైన వెంకటేష్ కు తండ్రిగా నటించారు ప్రకాష్ రాజ్.వయస్సుతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు ప్రకాష్ రాజ్.
రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.ఇటీవలే జరిగిన మా అధ్యక్ష పదవిలో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి అందరికి తెలిసిందే.సినిమాల విషయంలో ఎంతో శ్రద్ద వహిస్తూ వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు ప్రకాష్ రాజ్.