నెదర్లాండ్ తో మ్యాచ్ కు టీమిండియా ఆల్ రౌండర్ డౌటే..! కారణం తెలుసుకోవాలనుందా..!

t20 world cup

క్రికెట్ అభిమానులను మొదటి ఆట నుంచే మురిపించిన దేశం టీమిండియా అంటే సందేహం లేదు. ఇటీవల దాయాది దేశం (పాకిస్థాన్)తో జరిగిన మ్యాచ్ లో అభిమానులకు అన్ని మసాలాలు దట్టించి విజయం తెచ్చిపెట్టిన ఇండియా టీమ్ ను  దేశమే కాదు.. ప్రపంచం కూడా ఎన్నటికీ మరిచిపోదు. ఇందులో ప్రముఖంగా చెప్పుకునే ఆటగాళ్లు కింగ్ కోహ్లీ, హార్థిక్ ప్యాండ్యా. 

టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా 27 అక్టోబర్ (గురువారం) నెదర్లాండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వచ్చనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. పీటీఐ నివేదిక ప్రకారం.. సిడ్నీ స్టేడియం వేధికగా 27 న జరిగే మ్యాచ్ కు పాండ్యా విశ్రాంతి తీసుకోచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్ కు హార్థిక్ రాలేదు. 

గాయంతోనేనా..పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్థిక్ బ్యాటింగ్ పూర్తిగా ఫిట్ గా లేదని, అతను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం.. ఆయన ఫిట్ నెస్ ను మేనేజ్ మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. హార్థిక్ కూడా ప్రాక్టీస్ సెషన్ ను దాట వేయాలని నిర్ణయించుకున్నాడట. బౌలర్లకు ఒక రోజు ఇచ్చిన సెలవులో భాగంగానే ప్యాండ్యా ప్రాక్టీస్ మ్యాచ్ కు రాలేదనే వాదనలు కూడా ఉన్నాయి. నెదర్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఆయన ఆడుతారా..? ఆడరా..? అనే విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు. 

పాకిస్థాన్ పై ఇండియా విజయంలో ప్యాండ్యా పోషించిన పాత్ర గురించి చెప్పనవసరం లేదు. ఇటు బాల్ తోనూ, అటు బ్యాట్ తోనూ మంచి పర్మ్ఫార్మెన్స్ ఇచ్చారాయన. మొదట బౌలింగ్ లో 3 వికెట్లు తీసిన ప్యాండ్యా తరువాత బ్యాటింగ్ లోనూ విరుచుకుపడ్డారు. 40 పరుగులు చేసి ఇండియా విన్నింగ్ లో కీలక పాత్ర పోషించాడు. 

టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ పాకిస్థాన్ తో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ కు దిగిన పాక్ 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 82 పరుగులతో కింగ్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *