Hanuman Collections: బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ కలెక్షన్ల జోరు..వారం రోజుల్లో యెంత రాబట్టిందంటే.!

NEWS DESK
2 Min Read
Hanuman Collections

Hanuman Collections: హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా సంచలనం సృష్టిస్తుంది.

తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా స్టార్ హీరో సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది.ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ మూవీ థియేటర్ లలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి క్రియేట్ చేస్తుంది.

Hanuman Collections
Hanuman Collections

తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది లో మరియు అమెరికా లో హనుమాన్ జోరు కొనసాగుతుంది.హనుమాన్ మూవీ నార్త్ లో ఇప్పటికే ఇరవై కోట్లకు పైగా షేర్ లు రాబట్టినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే ముప్పై కోట్లు కలెక్షన్లు రాబట్టింది.రిలీజ్ అయిన రెండు వారాలలోనే రూ.150 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ఒక పోస్ట్ ను రిలీజ్ చేసారు.

Also read : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…అప్పుడే ఓటిటీ లోకి వచ్చేసిన సలార్…ఎక్కడంటే

Hanuman Collections
Hanuman Collections

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.వారం రోజుల లోనే రూ.150 కోట్ల మెయిలు రాయిని దాటడం విశేషం అని చెప్పచ్చు.రానున్న రోజుల్లో ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకా భారీ స్థాయిలో పెరగనున్నట్లు తెలుస్తుంది.

Also read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నా ఆటోగ్రాఫ్ హీరోయిన్ గోపిక…ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *