2774 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం…


తెలంగాణ ప్రభుత్వం మరో 2774 ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవలే 80 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే పలు నోటిఫికేషన్ లను ప్రభుత్వం రిలీజ్ చేసింది.501 ఖాళీలను గ్రూప్ 1 కు సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.17 వేలకు పైగా పోలీస్ జాబ్స్ ను భర్తీ చేయడానికి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

1200 కు పైగా ఖాళీలను విధ్యుత్ శాఖలో భర్తీ చేయడానికి సంబంధిత అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జరుగుతుంది.గ్రూప్ 4 కు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు చూస్తున్నారు.

వీటితో పాటు రాష్ట్రం లోని ఉస్మానియా యూనివర్సిటీ,జేఎన్టీయూ హెచ్,కాకతీయ వంటి పలు యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.వీటికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్,ఉన్నత విద్య శాఖ అధికారులు,యూనివర్సిటీ అధికారులు ఆదేశాలను జారీ చేయడం జరిగింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *