Vastu Tips: ఇంట్లో కాసుల వర్షం కురిపించే కుబేర మొక్క.. గుమ్మం దగ్గర ఈ మొక్క ఉంటే ఎన్నో అద్భుతమైన లాభాలు

ఆధ్యాత్మికం : Vastu Tips: మన దేశ ప్రజలకు తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్కతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే. అలాగే మన దేశానికి తులసి మొక్క ఎలాగో చైనా దేశానికి జెడ్ ప్లాంట్ మొక్క…

Vastu Tips
Vastu Tips

Vastu Tips: మన దేశ ప్రజలకు తులసి మొక్క చాలా పవిత్రమైనది. తులసి మొక్కతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే. అలాగే మన దేశానికి తులసి మొక్క ఎలాగో చైనా దేశానికి జెడ్ ప్లాంట్ మొక్క ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మనదేశంలో కూడా ఈ మొక్కలు దొరుకుతున్నాయి. కొంతమంది వీటిని ఇళ్లలో పెంచుకుంటున్నారు. ఇది కేవలం ఇంటి ఆవరణలో అందాన్ని పెంచడం కోసం మాత్రమే కాదు దీని వలన అనేక ఆసక్తికరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

జెడ్ మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది చాలా అందంగా కనిపించే మొక్క. అయితే దీని వెనుక చాలా ఆసక్తికరమైన ఒక రోజు కూడా ఉన్నాయి. ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉంటే అదృష్టాన్ని తెస్తుంది అని చాలామంది నమ్ముతారు. బోన్ సాయి ఆకృతి ఈ మొక్కకు ఇవ్వచ్చు. ఇంట్లో కుబేరుడి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ మొక్కను ఇంటి ఉత్తర దిశలో క్రాసుల నాటాలి. కుబేరుడికి ఈ మొక్క ఎంతో ఇష్టం.

దీనిని ఇంట్లో నాటడం వలన ఆ ఇంట్లో అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ మొక్క ఉన్న ఇంట్లో సంపద పెరుగుతుంది అని నమ్ముతారు కాబట్టి దీనిని డబ్బు చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్క ఇంట్లో సంపదకు అలాగే శ్రేయస్సుకు ప్రతీక గా చెప్తారు. ఈ మొక్క గురించి తెలిసిన చాలా మంది తమ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఆఫీస్ దగ్గర ఉంచుకుంటారు. ఇంటి ప్రధాన ద్వారంలో ఆగ్నేయ దిశలో ఈ మొక్కను పెంచడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థిక లాభాలు కలుగుతాయని చాలామంది నమ్మకం. అలాగే ఈ మొక్కను బహుమతిగా స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు గృహప్రవేశం చేస్తున్న సమయంలో ఇవ్వవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now
Written by

HelloBD Newz