సినిమా ఇండస్ట్రీలో చాల సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి చివరకు ప్లాప్ టాక్ దక్కించుకున్నవి ఉన్నాయి.అయితే అలా ప్లాప్ టాక్ రావడానికి వెనుక చాల కారణాలు ఉండవచ్చు.వాటిలో కొన్ని సినిమాల కాన్సెప్ట్ ప్రేక్షకులకు అర్ధం కాకా కూడా ప్లాప్ టాక్ కు కారణం కావచ్చు.కానీ అవే సినిమాలు బుల్లితెర మీద టీవిలో ప్రసారం అయ్యి సూపర్ హిట్ సినిమాలు గా పేరు తెచ్చుకున్నాయి.
ఇలా థియేటర్లలో ప్లాప్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు టీవిలో ప్రసారం అయ్యి మంచి టిఆర్పి రేటింగ్స్ ను దక్కించుకుంటాయి.కొన్ని సినిమాలు ఎన్ని సార్లు టీవిలో ప్రసారం అయినా కూడా ప్రేక్షకులు చాల ఆసక్తిగా చూస్తారు.అలా థియేటర్లో ప్లాప్ టాక్ తెచ్చుకొని టీవిలో హిట్ అయినా సినిమాలు ఇవే…
ఓంకారం:రాజశేఖర్,ప్రేమ కంబినేషన్లో ఈ సినిమా 1997 లో రిలీజ్ అయ్యింది.ఓంకారం చిత్రం కథాంశం కూడా దాదాపుగా అర్జున్ రెడ్డి,ఆర్ ఎక్స్ 100 చిత్రాల కలియిక అనే చెప్పచ్చు.కానీ ఈ చిత్రాన్ని అర్ధం చేసుకునే స్థాయి అప్పట్లో ప్రేక్షకులలో లేకపోవడంతో ఈ చిత్రం ప్లాప్ గా నిలిచింది.
ఆరెంజ్:రామ్ చరణ్,జెనీలియా కంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను దక్కించుకుంది.రామ్ చరణ్ మగధీర చిత్రం తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఒకరి మీద ప్రేమ కొంత కాలమే ఉంటుంది అనే కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్:ఈ చిత్రం థియేటర్లలో ప్లాప్ టాక్ తెచ్చుకున్న టీవిలో మాత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రాన్ని చూసి చాల మంది తమ చిన్ననాటి స్కూల్ మరియు కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకోక మానరు.
ఖలేజా:మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ఖలేజా సినిమా బాగానే ఉన్నప్పటికీ థియేటర్లలో ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ బుల్లితెర మీద ప్రసారం అయితే మాత్రం ఖలేజా మూవీ ఇష్టం గా చూసే ప్రేక్షకులు చాల మందే ఉన్నారు.