Varun Tej-Lavanya Tripathi: గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్,లావణ్య పెళ్లి ఇటలీలోని టస్కనీ లో నవంబర్ 1 న ఘనంగా జరిగింది.ఇరువురు కుటుంబసభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య వరుణ్ వేదమంత్రాల సాక్షిగా లావణ్య మేడలో మూడు ముళ్ళు వేసి ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.పలువురు సినిమా ప్రముఖులు కూడా వీరిద్దరి పెళ్లి లో సందడి చేసారు.అక్టోబర్ 30 నుంచే వీరిద్దరి పెళ్లి సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.
ఇక అప్పటి నుంచి రోజు వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.పెళ్లి అయినా తర్వాత ఒకే ఫ్రెమ్ లో నూతన వధూవరులతో పాటు మెగా,అల్లు హీరోలంతా కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ కలిసి నడుస్తూ చిరునవ్వు నవ్వుతున్న ఫోటో ఒకటి మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.ఈ ఫోటోను చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
వరుణ్,లావణ్య కు విషెస్ చెప్తూ తమ ఫ్యామిలీ ఫోటోను అల్లు అర్జున్ షేర్ చేసారు.నూతన వధూవరులతో అల్లు అర్జున్,స్నేహ రెడ్డి,కుమారుడు అయాన్,కూతురు అర్హ తో కలిసి దిగిన ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.ఇక తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్ళిలో నిహారిక సందడి గురించి ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వదినమ్మ వచ్చేసింది అంటూ నిహారిక షేర్ చేసిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.హీరో నితిన్ తన భార్య షాలిని తో కలిసి ఇటలీ లో వరుణ్,లావణ్య పెళ్లి కి వెళ్లారు.ఇక తన స్నేహితుడు వరుణ్ కు విషెస్ చెప్తూ ఫోటోను షేర్ చేసారు నితిన్.
View this post on Instagram